నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె/పీటీఎం - సెప్టెంబర్ 15 : తంబళ్లపల్లె రైతాంగం దశాబ్దాల కల నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో హంద్రీనీవా జలాలు కరువు నేల తంబళ్లపల్లె ప్రాంతానికి తరలి రావడంతో తంబళ్లపల్లె రైతాంగం ఇది కల నిజమా అని చమర్చిన కళ్ళతో పులకరించిపోయింది. మంగళవారం హంద్రీనీవా జలాలు సత్యసాయి జిల్లా నుండి అన్నమయ్య జిల్లా పిటిఎం మండలం సదుం క్రాస్ వద్దకు చేరుకోగానే మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ అశేష జనవాహినితో మేళ తాళాలు, మంగళ వాయిద్యాలుతో అక్కడకు చేరుకొని సాంప్రదాయబద్ధంగా హంద్రీనీవా జలాలకు భక్తిశ్రద్ధలతో జలహారతి సమర్పించారు. హంద్రీనీవా జలాలకు శాస్రోత్తకంగా పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలు, సారే సమర్పణ, పూలతో అభిషేకం, అఖండ జల హారతి అశేష జన వాహిని జయ జయ ద్వానాల మధ్య మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ జలహారతి నిర్వహించారు. ఆయన భావోద్వేగంగా మాట్లాడుతూ కరువు ప్రాంతమైన తంబళ్లపల్లెకు భవిష్యత్తులో సాగు-తాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం దేనని చెప్పడంతో జనాలు ఈలలు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. గత వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలు గ్రాఫిక్స్ లో చూపించి ప్రజలను పచ్చిమోసం చేసిందని నేటి మా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు కృషితో కరువు ప్రాంతానికి గంగమ్మ తల్లి తరలి రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులు, జనాల గుండెల్లో అపర భగీరధుడుగా నిలిచాడని హర్షద్వానాల మధ్య ప్రకటించారు. కరువుతో అల్లాడుతున్న తంబళ్లపల్లె రైతాంగానికి, ప్రజలకు ప్రతి చెరువును హంద్రీనీవా జలాలతో నింపి సాగునీరుతోపాటు తాగునీరు అందించేంతవరకు విశ్రమించనని శపథం చేశారు. తంబళ్లపల్లె ను వైకాపా నాయకులు అన్ని రకాలుగా నిలువునా దోచుకున్నారు తప్ప అభివృద్ధి చేసింది శూన్యమని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయ డంఖా మోగించడం ఖాయమని ధీమాగా చెప్పారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలు హంద్రీ నీవా జలాలను ఆస్వాదించి జయహో చంద్రబాబు నాయుడు, జి శంకర్ యాదవ్ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ జల హారతి కార్యక్రమానికి ఆరు మండలాల టిడిపి నాయకులు, కార్యకర్తలు, రైతులు, కూలీలు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తంబళ్లపల్లె నుండి స్వచ్ఛందంగా చలో జలహారతి ః తంబళ్లపల్లె మండలం నుండి టిడిపి నాయకులతో పాటు రైతులు స్వచ్ఛందంగా వాహనాల్లో సదుం జల హారతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, పురుషోత్తం, ఎర్రసానిపల్లి సుధాకర్, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, మాజీ మల్లయ్య కొండ చైర్మన్ గంగుల్ రెడ్డి, తెలుగు యువత గంగరాజు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నరసింహులు, కొటాల అల్లావుద్దీన్, బాలకృష్ణారెడ్డి, కొట్టాల సుధాకర,ఐసుల కృష్ణ, నాయకులు, కూటమి నాయకులు, రైతులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు
Reporter
Namitha News