నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి - కూటమి పాలనలో రాష్ట్రం సస్యశ్యామలం - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి హర్షం : సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోందని,కూటమి పాలనలో రాష్ట్రం సస్యశ్యామలం మారిందని తెలుగుదేశం పార్టీ యువనేత,ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) పేర్కొన్నారు.మంగళవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు 14వ వార్డు పరిధిలోని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో నాడు స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి,అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అండగా నిలిచారన్నారు.అదే స్ఫూర్తితో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు.ప్రతి నెల ఒకటో తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తూ వృద్ధులు,దివ్యాంగులు,వితంతువులు,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారన్నారు.సీఎం అనుభవం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతోందన్నారు.ఇక ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా మదనపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు ప్రజా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని త్వరలో జరుగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Reporter
Namitha News