Saturday, 12 September 2026 04:42:29 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి వాటి పైన చర్యలు తీసుకోవాలి

బీసీవై పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు గారికి వినతి

Date : 19 May 2026 04:59 PM Views : 202

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అనంతపురం - అనంతపురం నగరంలో శ్రీ చైతన్య పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నడుపుతున్న పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని బీసీవై పార్టీ విద్యార్థి విభాగం అధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీసీవై పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ సురేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వాన్నిబంధనలకు విరుద్ధంగా కాసులకు కక్కుర్తి పడి అనంతపురం నగరంలో శ్రీ చైతన్య విద్యాసంస్థలు జిల్లా విద్యాశాఖ అధికారులను బురిడీ కొట్టిస్తూ నగరంలో ఉన్న పది బ్రాంచ్ లకు నర్సరీ ఎల్కేజీ యూకేజీ అనుమతులు లేకపోయినా వాటికి అనుమతులు ఉన్నట్టు విద్యార్థులను చేర్చుకొని వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని తక్షణమే వాటిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు,, వాటితోపాటు నగరంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలకు తరగతికి ఒక సెక్షన్కు అనుమతి తీసుకుని ఒక విద్యాసంస్థలలో మూడు నాలుగు సెక్షన్లు నిర్వహిస్తామన్నారు వాటిపైన జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ జరిపించాలని కోరారు. పామ్ రైట్ సి బి ఎస్ సి పాఠశాలకు ఒకటి రెండు మూడు తరగతులకు విద్యార్థులు లేకపోయినప్పటికీ రాష్ట్ర విద్యాశాఖకు సీబీఎస్సీ బోర్డుకు దొంగ పేర్లు చూపించి అనుమతి తీసుకువచ్చారు సీబీఎస్ఈ బోర్డును రాష్ట్ర విద్యాశాఖ అధికారులను మోసం చేయడం జరిగిందని మండిపడ్డారు దానితోపాటు తొమ్మిది పది తరగతులకు అనుమతులు లేకపోయినా విద్యార్థులను చేర్పించుకొని కర్నూల్ లో పరీక్షలు నిర్వహిస్తున్నారు అని ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆదిమూర్తి నగర్ లో ఉన్న బ్రాంచ్ మరియు రుద్రంపేటలో ఉన్న బ్రాంచ్ కు 5 6 7 8 9 తరగతులకు అనుమతులు లేకపోయినా వాటిని నిర్వహిస్తా ఉన్నారని తక్షణమే వాటిపైన విచారణ జరిపించాలన్నారు వాటితో పాటు విద్యాసంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలను వేళ్ల రూపాయలకు ఆన్లైన్ లో జొమాటో స్వీకీ రూపలలో తల్లితండ్రుల ఇళ్లకు డెలివరీ చేస్తూ ఆ డెలివరీ కాస్ట్ ను కూడా విద్యార్థుల తల్లిదండ్రులపై మోపుతున్నారని మండిపడ్డారు.. తక్షణమే అనంతపురం నగరంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూ ఉన్న శ్రీ చైతన్య విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిసివై పార్టీ విద్యార్థి విభాగం నాయకులు రామాంజనేయులు గోవిందు రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :