Sunday, 13 September 2026 08:11:13 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

బిసివై పార్టీ ఆధ్వర్యంలో విజయవంతం గా బి.సి. ల మహా సదస్సు

బిసి లకు రక్షణ చట్టం, రాజధాని లో బిసి పారిశ్రామిక వేత్తలకు కూడా ఎకరం 99 పైసలకే వెయ్యి ఎకరాలు కేటాయించాలని డిమాండ్ - బిసివై అధినేత బోడే రామచంద్ర యాదవ్

Date : 11 December 2025 10:51 PM Views : 330

నమిత న్యూస్ - Andhra Pradesh / NTRDistrict : విజయవాడ - డిసెంబర్ 11 : రాష్ట్రంలో బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక హక్కులపై విస్తృత చర్చ జరిపే లక్ష్యంతో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఏపీ బీసీ మహా సదస్సు - చర్చ కార్యక్రమం ను విజయవంతగా విజయవాడ లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు బీసీ సంఘాల నాయకులు, మేధావులు పాల్గొని, బీసీల అభ్యున్నతికి సంబంధించిన పలు కీలక అంశాలపై తమ అమూల్యమైన సూచనలు అందించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సదస్సు ఏకబిగిన నిరాటకంగా నిర్వహించడం కూడా విశేషం. ఈ సదస్సును ఉద్దేశించి బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రభుత్వాల వైఫల్యాలను ఆయన ఎత్తిచూపారు. రాజధాని పై రెండు పార్టీల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టీడీపీ, వైసీపీలు కేవలం రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం రెండు ప్రైవేట్ కంపెనీలుగా వ్యవహారిస్తున్నాయని రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు, అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలా భావించి, గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే 33 వేల ఎకరాలు సేకరించి, రైతులకు కేవలం ఒక పత్రం ఇచ్చి ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు వైఖరిని అలుసుగా తీసుకున్న జగన్, మూడు రాజధానులనే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి, చివరికి రాష్ట్రాన్ని రాజధాని లేని అనాథగా మిగిల్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రామచంద్రయాదవ్ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన టీడీపీ, అదే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పునః ప్రారంభించిందని, రాజధాని రైతులను మోసం చేసే పనులు చేస్తోందని అన్నారు. 33 వేల ఎకరాలు పంచాయితీకి కూడా సరిపోవని ఎద్దేవా చేసిన చంద్రబాబు, గెజిట్ ఆమోదముద్ర వేయించుకోలేకపోతున్నారని, దీని వెనుక ఆయన చిత్తశుద్ధి లోపించిందని స్పష్టమవుతోందని అన్నారు. ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు కడతామని కుంటిసాకులు చెబుతూ, ఆ భూములను ఆయన జేబు కంపెనీలకు, తమ బంధువులకు దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో బీసీలకు వెయ్యి ఎకరాల వాటాగా ఇస్తూ విశాఖ లో మాదిరిగా ఎకరం 99 పైసలకే కేటాయించాలి. రాజధాని అంటే పరిపాలనకు సంబంధించిన నిర్మాణాలు కావాలని, కేవలం వ్యాపార కేంద్రం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు రాజధాని నిర్మాణంలో దక్కాల్సిన వాటాపై చర్చించడానికే ఈ సభ ఏర్పాటు చేశామన్నారు. గతంలో హైదరాబాద్ విషయంలో జరిగిన మోసం, అమరావతిలో పునరావృతం కానివ్వబోమని హెచ్చరించారు. బీసీ యువ పారిశ్రామికవేత్తల కోసం రాజధానిలో తక్షణమే మరో వెయ్యి ఎకరాలు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూపాయికి ఎకరం చొప్పున తమ కుటుంబ సభ్యులకు, జేబు సంస్థలకు ఇచ్చినట్లే... బీసీలకు కేటాయించే ఆ వెయ్యి ఎకరాలకు ప్రభుత్వం నిర్దేశించిన ధరను చెల్లించడానికి ఒక బీసీ బిడ్డగా తాను వ్యక్తిగతంగా సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్ విసిరారు. బీసీ రక్షణ చట్టంపై రెండు పార్టీల మౌనం ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీలపై దాడులు జరుగుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో బీసీలకు రక్షణ కల్పించే 'బీసీ రక్షణ చట్టం' తేవాలని 2023 జూలై లో జరిగిన బీసీవై పార్టీ ఆవిర్భావ సభలోనే తాను డిమాండ్ చేశానని గుర్తుచేశారు. ఆ తర్వాత మూడు నెలలకు నారా లోకేష్ తమ డిమాండ్‌ను కాపీ కొట్టి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూరా హామీ ఇచ్చి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్న జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ చట్టం గురించి మాట్లాడకపోవడం దారుణమన్నారు. బీసీ రక్షణ చట్టం గురించి మాట్లాడకుండా టీడీపీ, వైసీపీలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. 44% రిజర్వేషన్లతో పాటు సమగ్ర కులగణన నిర్వహించాలి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు ఏకమై ఉద్యమిస్తున్నాయని, కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర కులగణన చేపట్టి, దివంగత ఎన్టీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం, మురళీధరన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. బీసీల ఆత్మగౌరవంపై హెచ్చరిక ఇటీవల జగన్ మోహన్ రెడ్డి బీసీ అధికారులను 'వాడూ, వీడూ' అని కించపరిచేలా మాట్లాడితే, వైసిపిలో ఉన్న బీసీ నేతలు ఖండించకపోగా ఆయనను పొగడటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు గానీ, జగన్ గానీ, మరెవరైనా గానీ బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శాఖను కూడా నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారనడం, బీసీ నేతలను ఎలా అణచివేస్తున్నారో చెప్పడానికి నిదర్శనమన్నారు. 2026 ఫిబ్రవరి 22న బిసి గర్జన... భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన రామచంద్రయాదవ్ టిడిపి, వైసిపి దోపిడీ పార్టీలనే గ్రహణాలు వీడకపోతే బీసీలకు న్యాయం జరగదని, బీపీ మండల్, మురళీధరన్ కమిషన్ సిఫార్సుల మేరకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలతో పాటు చట్టసభల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని దేశవ్యాప్త ఉద్యమానికి బీసీవై పార్టీ శ్రీకారం చుడుతుందని రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ఇందులో భాగంగా, 2026 ఫిబ్రవరి 22న దేశవ్యాప్త బీసీ ప్రముఖులతో, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని రాష్ట్ర రాజధానిలో భారీ ఎత్తున "బీసీ గర్జన" బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :