Thursday, 30 July 2026 09:03:21 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు

Date : 30 July 2026 06:17 PM Views : 26

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు - టైలరింగ్ శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్స్ ప్రదానం మదనపల్లె : మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు వేస్తోందని ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా పేర్కొన్నారు.బి.కే.పల్లి ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణ పూర్తిచేసిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరుకాగా ధాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ స్వాతి చక్రపాణి శాలువాతో సన్మానించి అపూర్వ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాత్రి ఫౌండేషన్ మహిళలకు చేయూతనిస్తూ ఎంతోమంది మహిళల జీవితాలకు వెలుగునిస్తోందని కొనియాడారు.అంతేకాకుండా ఆనంద నిలయం పేరిట వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి వృద్ధుల అలనాపాలన చూస్తున్నారన్నారు.సేవా కార్యక్రమాలలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న ధాత్రి ఫౌండేషన్ కి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం డాక్టర్ స్వాతి చక్రపాణి మాట్లాడుతూ తమ సంస్థలో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ఎమ్మెల్యే పెద్ద మనసుతో హాజరై మమ్ములను ఎంతో ఉత్తేజపరుస్తున్నారన్నారు.ప్రజాసమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని కృషి చేస్తున్న ఏకైక నాయకుడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అని కొనియాడారు.తమ ఫౌండేషన్ సేవలను గుర్తించి స్థలం కేటాయిస్తామనడం ఆయన మంచితనానికి నిదర్శనమన్నారు.ఎమ్మెల్యే సహకారంతో సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని ఆమె స్పష్టం చేశారు.అనంతరం టైలరింగ్ శిక్షణ పూర్తిచేసిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :