Sunday, 13 September 2026 09:57:28 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మత్స్యకార భరోసాను బెస్తనేస్తంగా పథకం అమలు చేయాలి

భీష్మ ఏకాదశిని రాష్ట్ర పండుగగా గుర్తించాలి

Date : 19 July 2026 05:16 PM Views : 117

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మత్స్యకార భరోసాను బెస్తనేస్తంగా పథకం అమలు చేయాలి - భీష్మ ఏకాదశిని రాష్ట్ర పండుగగా గుర్తించాలి - మత్స్యకారులను మాత్రమే సహకార సంఘాలకు అధ్యక్షులుగా నియమించాలి - విస్తృతస్థాయి సమావేశంలో బెస్త నాయకులు డిమాండ్ మదనపల్లె : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ బెస్త మత్స్యకారుల ఉపకులాల సంక్షేమ సంఘం,బెస్త సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మదనపల్లె పట్టణం శ్రీరస్తు ఫంక్షన్ హాల్ నందు జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది.బెస్త సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మడితం రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గువ్వల గంగాధర్,రాష్ట్ర అధ్యక్షులు నడికుదిటి అర్జున్,బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్,ఆప్కాబ్ చైర్మన్ యాదగిరి రాంప్రసాద్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు,మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు ఇస్తున్న మత్స్యకార భరోసాను,మైదాన ప్రాంత బెస్తలకు బెస్తనేస్తం పథకంగా అమలు చేయాలన్నారు.వ్యాసపూర్ణిమ,భీష్మ ఏకాదశి పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించాలని,మత్స్య కార సొసైటీలలో జీవో నెం.98ని కఠినంగా అమలు చేసి,అన్య కులస్తులతో నిండిన మత్స్య సహకార సంఘాలను రద్దు చేయడంతోపాటు సాంప్రదాయ మత్స్యకారులను నిబంధనలు లేకుండా నేరుగా సహకార సంఘాలలో సభ్యులుగా చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.సాంప్రదాయ మత్స్యకారులను మాత్రమే,మత్స్య సహకార సంఘాలకు అధ్యక్షులుగా ఎన్నుకొవాలని,రాయలసీమ ప్రాంతంలో మత్స్య కార లైసెన్స్ లు మంజూరు చేయాలని కోరారు.మత్స్య సహకార సంఘం సభ్యులు,మత్స్యకార లైసెన్సులు పొందిన సాంప్రదాయ మత్స్య కారులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని,ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని కోరారు.అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మడితం రమణ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఒక గంగ పుత్ర భవన్,ఆశ్రమ పాఠశాల నిర్మించాలని,ఇప్పటికే ఉన్న ప్రాంతాలలో మరింత అభివృద్ధి చేయాలని,మత్స్యకారుల సంస్కృతిని కాపాడాలని కోరారు.చట్టసభలలో స్థానంలేని బెస్తలకు రాయలసీమలో ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయించడంతోపాటు స్థానిక సంస్థలు,పార్టీ పదవులలో జనాభా ప్రాతిపధికన ప్రాధాన్యత కలిగించాలని విజ్ఞప్తి చేశారు.బెస్తల పిల్లలకు ఆశ్రమ పాఠశాలలు,హాస్టల్ వసతి,కల్పించాలని కోరారు.బెస్తమహిళల ఆర్థిక ప్రగతికి మత్స్య ప్రాసెసింగ్ యూనిట్లు,ఫిష్ మాల్టులు,ఏర్పాటు చేయాలన్నారు.కరువు ప్రాంతమైన రాయలసీమలో గల ప్రాజెక్టులు,పెద్ద చెరువులలో చేపలు పట్టడానికి బోట్లు,వలలు ఉచితంగా ఇవ్వాలన్నారు.అనంతరం ముఖ్య అతిథులు స్పందిస్తూ బెస్త మత్స్యకారుల న్యాయమైన టుమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని అమలు చేసేవిధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.అనంతరం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రంతో పాటు రాయలసీమ అన్నమయ్య జిల్లా నుంచి పెద్దఎత్తున బెస్త మత్స్యకారులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :