Sunday, 13 September 2026 07:46:39 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ

ఆగస్టు 6 నుంచి 15 వరకు సీపీఐ పాదయాత్రలను విజయవంతం చేయాలి

Date : 26 July 2026 09:00 AM Views : 173

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 25 : ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నీట్ పరీక్షల వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల గొంతును అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలకు, విద్యార్థుల ఆందోళనలో పోలీసులు లాఠీ చార్జి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని సీపీఐ జిల్లా సహయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ, తంబళ్లపల్లె నియోజకవర్గ కార్యదర్శి మనోహర్ రెడ్డి తెలిపారు శనివారం బి కొత్తకోట లో సీపీఐ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 27న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, యువజనులు, ప్రజాసంఘాలు, రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే అన్నమయ్య జిల్లాలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతాంగం, వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంటలు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, తాగునీటి సమస్య తీవ్రమవడం వల్ల గ్రామీణ ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్నమయ్య జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి, రైతులకు ప్రత్యేక సహాయ ప్యాకేజీ, రుణాల పునర్వ్యవస్థీకరణ, ఇన్‌పుట్ సబ్సిడీ, ఉపాధి హామీ పనులను విస్తృతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు

జిల్లాలో త్రాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని, ప్రతి గ్రామానికి తక్షణమే తాగునీరు అందించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని, చెడిపోయిన తాగునీటి పథకాలను వెంటనే మరమ్మతు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆగస్టు 6 నుంచి 15 వరకు సీపీఐ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిర్వహించే పాదయాత్రలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరవు, తాగునీటి కొరత, రైతాంగ సమస్యలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రజావ్యతిరేక విధానాలపై గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు

ఈ కార్యక్రమంలో సీపీఐ బి కొత్తకోట మండల కార్యదర్శి రఘునాథ్,పట్టణ కార్యదర్శి అష్రఫ్ అలీ, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు తంబయ్యశెట్టి,గంగులప్ప తదితరులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :