నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కేసి గుప్తా జయంతిని పురస్కరించుకొని సేవాకార్యక్రమాలు - వాసవి క్లబ్ అధ్యక్షుడు వివి కృష్ణారావు వెల్లడి మదనపల్లె : కేసి గుప్తా జయంతి,వాసవి వారోత్సవాల సందర్భంగా వాసవి క్లబ్ మదనపల్లె వారి ఆధ్వర్యంలో శనివారం టీచర్స్ డేని పురస్కరించుకొని భావితరాలకు విద్యను ఉపదేశించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను క్లబ్స్ గుర్తించి ప్రస్తుతము పనిచేయుచున్న మరియు విశ్రాంత ఉపాధ్యాయులకు స్థానిక సొసైటీ కాలనీలోని రామాలయ కళ్యాణ మండపం నందు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని శాలువాలతో సత్కరించి వారికి తగు రీతిలో బహుమతులు అందజేసి ఉపాధ్యాయులను అందరినీ గౌరవించడం జరిగింది.ఉపాధ్యాయులు నవసమాజ నిర్మాతలని,వారిని గౌరవించుకోవడం మన బాధ్యత అన్నారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ వివి కృష్ణారావు,సెక్రెటరీ ఇ.వినయ్ కుమార్,ట్రెజరర్ కోటా చంద్రశేఖర్ గుప్తా,పూర్వ అధ్యక్షులు రాచపల్లి రాజేష్,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బి.కె అనిల్ కుమార్,వైస్ ప్రెసిడెంట్ పిన్నపాటి రామ్ కుమార్,సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ చైర్మన్ పి.వి సుబ్రహ్మణ్యం,వికేఎస్పీ ఇన్చార్జ్ రాచపల్లి రాఘవేంద్ర,సభ్యులు వై.సంతోష్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
Reporter
Namitha News