Thursday, 16 April 2026 03:21:32 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అన్నమయ్య జిల్లా అగ్రగామిగా నిలవాలి

స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ సంకల్పానికి అనుగుణంగా వ్యవసాయం, విద్య, వైద్య రంగంలో అన్నమయ్య జిల్లా ఫలితాల

Date : 17 March 2026 11:04 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 17 : ప‌థ‌కాల స్ఫూర్తిని పూర్తిస్థాయిలో అర్థంచేసుకుంటూ అభివృద్ధి దిశ‌గా అడుగులు వేయ‌డం ప్ర‌ధాన‌మ‌ని.. ఈ నేప‌థ్యంలో స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప్ర‌తి కార్య‌క్ర‌మం అమ‌లుకావాల‌ని అధికారుల‌కు దిశానిర్దేశం చేసిన‌ట్లు ఇరవై సూత్రాల కార్య‌క్ర‌మం ఛైర్మ‌న్ లంకా దిన‌క‌ర్ అన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు ఇరవై సూత్రాల కార్య‌క్ర‌మం ఛైర్మ‌న్ లంకా దిన‌క‌ర్.. జిల్లా క‌లెక్ట‌ర్ నిషాంత్ కుమార్, ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా లతో క‌లిసి వ్యవసాయం, వైద్య ఆరోగ్యం మరియు విద్యాకు సంబందించిన పథకాలు , అమృత్ 1.0, అమృత్ 2.0, జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌, పీఎం సూర్య‌ఘ‌ర్‌, పీఎం కుసుమ్‌ల‌పై ఆయా శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. పీఎం ధన ధాన్య కృషి యోజన : దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా 2026 - 27 ఆర్ధిక సంవత్సరం నుండి దేశంలోని 100 జిల్లాలో అమలు చేస్తున్న “ పీఎం ధన ధాన్య కృషి యోజన “ అన్నమయ్య జిల్లా కుడా ఎంపిక అయ్యింది, వ్యవసాయ ఉత్పాదకత ప్రతికూలత ఉన్న జిల్లాలలో అమలు అవుతున్న ఈ పథకం కోసం జిల్లా యంత్రాంగం సహేతుకంగా జిల్లాలో ఏ ప్రాంతంలో అవసరమైన వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి మౌలిక సదుపాయాలు కల్పించాలో గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించడం జరిగింది. టమాటో రైతుల సమస్యలు : టమాటో పంటకు సంబంధించి వివిధ కాలాలలో హెచ్చు తగ్గుల వ్యత్యాసం సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు గతంలో జరిగిన సమీక్షకు సంబంధించి పురోగతి సాధించాలని అన్నారు. టమోటో మార్కెట్ ఊరు నడిబొడ్డులో ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బంది మరియు మార్కెట్ నిర్వాహకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పైన చర్యలు ఏమి తీసుంటున్నారని అధికారులను అడగడం జరిగింది. ఉపాధి హామీ అవకతవకలు - వీబి –జీ రామ్ జీ : గత సమీక్షలో రాబట్టిన వివరాల ప్రకారం అన్నమయ్య జిల్లాలో 2019 - 24 మధ్య ఉపాధి హామీ పనుల మెటీరియల్ కాంపోనెంట్ ఎంటైటిల్మెంట్ & వాస్తవ వ్యయం మరియు నష్టపోయిన నిధులు బాగా ఉన్నాయి మరియు ఉపాధి హామీ నిధుల వినియోగంలో అవకతవకలు భారీగా జరిగాయని తెలిపారు. మరో వైపు లేబర్ వేతనాల వినియోగం మాత్రం పూర్తిగా 100% సాధించినట్లు లెక్కలు చూపారు, ఇప్పడు కె వై సీ అప్లై చేస్తే ఎంత మంది తగ్గారు, ఆ డబ్బు ఎవరి జేబులలోకి వెళ్లింది? ఈ అరాచకాలు అరికట్టి నిజమైన వేతనదారులకు న్యాయం చేయడం, పని దినాలు 100 నుండి 125 కు పెంచడం, రైతులకు సకాలంలో కూలీలు అందుబాటులో ఉండడానికి 60 రోజులు మినహాయింపు ఇచ్చిన అన్సంతరం 125 రోజుల పని దినాలు అంటే మొత్తం 185 రోజులు కూలి దొరికే విధంగా కేంద్ర ప్రభుత్వం “ వీబి –జీ రామ్ జీ “ తేవడం జరిగింది. ఈ పథకం క్రింద అత్యధిక నిధులు అన్నమయ్య జిల్లాకు తేవడానికి ప్రణాళికలు రచించాలి. పీఎం మాతృవందన యోజన, జ‌న‌నీ సుర‌క్షా యోజ‌న (జేఎస్‌వై), జ‌న‌నీ శిశు సంర‌క్ష కార్య‌క్ర‌మం, రాష్ట్రీయ కిషోర్ స్వస్త కార్యక్రమం (ఆర్కెఎస్కె), రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ( ఆర్బీఎస్కె), ఆయుష్మాన్ భార‌త్ - ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న, ఎన్టీఆర్ వైద్య సేవ, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ భోజన పథకం, పీఎం శ్రీ త‌దిత‌ర ప‌థ‌కాల‌తో పాటు గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత తాగునీటిని అందించే జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌, అమృత్ ప‌థ‌కాల‌కు సంబంధించిన అంశాల‌పై స‌మీక్షించి, పురోగ‌తికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌పై సూచ‌న‌లు చేశారు. బ‌హుళ ప్ర‌యోజ‌నాల పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం అమ‌ల్లోనూ మ‌రింత చొర‌వ చూపాల‌న్నారు

స‌మీక్షా స‌మావేశం అనంత‌రం లంకా దిన‌క‌ర్ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ … వైద్య రంగం: జిల్లాలో 19 నుండి 45 సంవత్సరాల వయస్సు వారికి మరియు ముఖ్యంగా 5 నుండి 19 సంవత్సరాల వారికి మరియు గర్భిణీ స్త్రీలకూ అవసరమైన వైద్యం అందించి మందులు అందిస్తూ " అనీమియా ముక్త్ భారత్ కోసం అధికారులు కృషి చేస్తున్నారు. ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ క్రింద 2,936 మందికి ప్రతి 15 రోజులకు ఒకసారి ముందస్తు కాన్పులను తగ్గించడానికి స్కాన్లు మరియు రక్త పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి నెల 9 మరియు 10 వ తేదీ అన్ని ప్రభుత్వం ఆస్పత్రులలో గైనకాలజిస్ట్ ద్వారా గర్బీణీ స్త్రీలకు అన్ని పరీక్షలు మరియు సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో100 శాతం ప్ర‌స‌వాలు ఆసుప‌త్రుల్లోనే జ‌రుగుతున్నాయ‌ని.. ఈ సంవత్సరం ఏప్రిల్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు మంది 7,160 మంది శిశువులు ఆసుపత్రులలో జన్మించగా, ఇందులో గర్బిణి స్త్రీలకు పోషక ఆహారం కోసం జ‌న‌నీ సుర‌క్షా యోజ‌న ( JSY ) ద్వారా 700 రూపాయిలు మరియు సుఖీభవ ద్వారా 300 రూపాయిలు కలిపి మొత్తం 1000 రూపాయిలు చెప్పున 69 లక్షల రూపాయలను ఈ సంవత్సరంలో ఏప్రిల్ 2025 నుండి ఫిబ్రవరి వరకు లబ్దిదారులకు అందించడం జరిగింది. అదేవిధంగా జ‌న‌నీ శిశు సంర‌క్ష కార్య‌క్ర‌మం ( JSSK ) ద్వారా ఉచిత పౌష్టికాహారం, మందులు, వైద్య ప‌రీక్ష‌లు వంటి సేవ‌లు కోసం ఈ సంవత్సరం ఏప్రిల్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు 6,248 మందికి 4 లక్షల రూపాయిలను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. స్వ‌ర్ణాంధ్ర విజ‌న్ @ 2047 ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించ‌డంపై ప్ర‌భుత్వం దృష్టిసారిస్తోంద‌ని.. ఈ క్ర‌మంలో మాతా శిశు మ‌ర‌ణాల రేటును త‌గ్గించ‌డంపై అధికారుల‌కు సూచ‌న‌లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన క్రింద మొదటి కాన్పు సమయంలో 5 వేల రూపాయిలు రెండు వాయిదాలలో మరియు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో కాన్పు అయితే మరో వెయ్య రూపాయిలు కలిపి మొత్తం 6 వేలు, రెండవ కాన్పులో ఆడ శిశువుకు జన్మనిస్తే 6 వేలు ప్రోత్సాహకంగా నగదు అందించడం జరుగుతుంది. 2024 - 25 సంవత్సరంలో మొదటి కాన్పు 3,089 మరియు రెండవ కాన్పు ఆడ శిశువు 37 కలిపి మొత్తం 3,126 మంది లబ్దిదారులకు 1.29 కోట్ల రూపాయిలు నగదు బదిలీ చేయడం జరిగింది. 2025 - 26 సంవత్సరం నుండి ఈ కార్యక్రమ అమలు భాద్యతను ఐ సి డీ ఎస్ వారికి బదిలీ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. స్కూల్ ఐ స్క్రీనింగ్ కార్యక్రమం క్రింద జిల్లాలో పాఠశాలలో కంటి పరీక్షలను నిర్వహించడం జరిగింది. 3,250 కళ్ళ జోడులు అవసరం అవ్వగా అందరికి అందించడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.సీజనల్ వ్యాధులకు సంబంధించి ప్రత్యేక దృష్ట పెట్టి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు : ముందస్తు రోగ నిరోధ లక్ష్యంగా ప్రాధమిక ఆరోగ్ర్యం కోసం జిల్లాలో 309 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా, 92 భవనాలు మంజూరు అయ్యాయి, రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం (ఆర్కెఎస్కె) : 10 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పురుషులు మరియు మహిళలను నగర, గ్రామ ప్రాంతాల్లో, అలాగే పాఠశాలలో చదువుతున్నవారైనా, చదువును మానేసినవారైనా సమగ్రంగా కవర్ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమం నిరోధాత్మక, ప్రోత్సాహక మరియు చికిత్సాత్మక సేవలను అందించడంతో పాటు, కౌన్సెలింగ్ మరియు ఆరోగ్య పరీక్షలను కూడా నిర్వహించడం జరుగుతుంది.. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ( ఆర్బీఎస్కె) : జననం నుంచి 18 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న పిల్లలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ బస్తీలు, అలాగే ప్రభుత్వ/సహాయ పాఠశాలల్లో చదివే పిల్లలు. స్క్రీనింగ్ విధానం: పుట్టిన శిశువులు: ప్రభుత్వ ఆరోగ్య సదుపాయాల్లో మరియు ఇంటి వద్ద స్క్రీనింగ్ నిర్వహించబడుతుందని 6 సంవత్సరాల లోపు పిల్లలు: స్క్రీనింగ్‌ను నియమితంగా అంగన్‌వాడి కేంద్రాల్లో చేస్తారని 6 నుండి 18 సంవత్సరాల పిల్లలు మొబైల్ బ్లాక్ హెల్త్ టీమ్‌లు పాఠశాలల్లోనే స్క్రీనింగ్ నిర్వహిస్తాయి. ఐఎంఆర్ ( ప్రతి వెయ్య మంది శిశువుల జననంలో మరణాల రేట్ ) : ప్రస్తుతం రాష్ట్ర సగటు 18 కాగా, అన్నమయ్య జిల్లా సగటు 6 గా నమోదు అయ్యిందని తెలిపారు. ఎంఎంఆర్ ( ప్రతి లక్ష మంది గర్భిణుల మరణాల రేట్ ) : ప్రస్తుతం రాష్ట్ర సగటు 39 కాగా, అన్నమయ్య జిల్లా సగటు 34 గా నమోదు అయ్యింది. భారీగా ఐఎంఆర్ మరియు ఎంఎంఆర్ ను మన జిల్లాలో భారీగా నియంత్రించ గలిగాం. నిక్షయ పోషణ్ యోజన : టీబీ వ్యాధి సోకిన వారికి వ్యాధి నిర్ధారణ అవ్వగానే మొదట 3,000 రూపాయిలు మరియు 3 నెలల తర్వాత మరో 3000 రూపాయలు సహాయం చేయడంతో పాటు పోషక ఆహారం కోసం నెలలు 1000 రూపాయిలు చొప్పున సహాయం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ సంవత్సరం 354 మందికి టీబీ సోకగా, 272 మందికి సహాయం అందుతుంది. జాతీయ కుష్టు నివారణ కార్యక్రమం ( ఎన్ ఎల్ ఈ పి) : ఈ సంవత్సరం ఇప్పటివరకు మందికి, గత సంవత్సరం మందికి 12 వేల రూపాయలు చొప్పున సహాయం అందింది. క్రిమి కీటకాదుల నుండి సంక్రమించే వ్యాధుల నివారణ (ఎన్ వీ బీ డీ సి పి) : ఈ కార్యక్రమం క్రింద ఈ సంవత్సరం ఇప్పటి వరకు లక్షల రూపాయిలు ఖర్చు చేయగా, గత సంవత్సరంలో లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. *ఆరోగ్య రక్షణ కోసం స‌మ‌న్వ‌య శాఖ‌ల స‌మ‌ష్టి కృషి* చిన్నారులు, గర్బిణీల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌లు లేకుండా చూడ‌టంలో మరియు పోషక ఆహారం అందించడానికి ఐసీడీఎస్‌ కేంద్రాల ద్వారా అంగన్వాడీ కేంద్రాలు, వైద్య ఆరోగ్యం మరియు విద్యాశాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్నాన్నారు. ఆయుష్మాన్ భార‌త్ - ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న - డా. ఎన్‌టీఆర్ వైద్య సేవ ద్వారా జిల్లాలో 2024 లో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 3.18 లక్షల మందికి వైద్య సేవ‌లు అందాయ‌న్నారు. 108 వాహ‌నాలు ( 33 ) 104 వాహ‌నాలు ( 32 ), 102 వాహ‌నాలు ( 20 ) ద్వారా సేవ‌లందుతున్నాయ‌ని.. 108 వాహ‌నాల‌కు సంబంధించి రెస్పాన్స్ టైమ్‌ను త‌గ్గించేందుకు నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ, స‌మ‌న్వ‌యం అవ‌స‌ర‌మ‌ని అధికారుల‌కు సూచించిన‌ట్లు తెలిపారు. 104 వాహ‌నాల ద్వారా మండలాలకు చెందిన విలేజ్ హెల్త్ సెంటర్లకు మెడికల్ ఆఫీసర్లతో నెల‌కు రెండుసార్లు స్థానికుల‌కు సేవ‌లందిస్తున్న‌ట్లు మరియు 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు ద్వారా ఈ సంవత్సరం ఇప్పటి వరకు గర్భిణి స్త్రీలకు సేవలు అందించామని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం అర్హులైన వారికి ఇప్పటివరకు పీఎంజేఏవై కార్డులు 1.98 లక్షల కుటుంబాలకు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు, మిగిలిన వారికి కూడా సత్వరం పంపిణీ చేయాలని అధికారులను లంకా దినకర్ ఆదేశించారు. అలాగే, 70 సంవత్సరాలు పైబడిన వారు 1.25 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఇప్పటి వరకు 55 వేల మంది మాత్రమే కార్డులు తీసుకున్నారు, పెద్ద వయస్సు రీత్యా కార్డులను వారి వద్దకే వెళ్లి ప్రక్రియ పూర్తి చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. విద్యా రంగం : బేటీ బచావో బేటీ పడావో - 11 నుండి 14 సంవత్సరాల వయస్సు వారు మరియు 15 నుండి 18 సంవత్సరాల వయస్సు వారు 50 నుండి 100 మంది చొప్పున 600 గ్రూపులు ద్వారా చదువు ఆవశ్యకత మరియు మంచి చెడు ప్రవర్తన పైన అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తల్లికి వందనం : జిల్లాలో దాదాపు 2.10 లక్షల మంది విద్యార్థులకు దాదాపు 340 కోట్లు సహాయం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్ - సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర : ఎలిమెంట్రీ నుండి సెకండరీ విద్యా వరకు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు చదువుకు అవసరమైన నోట్ పుస్తకాలు, వర్క్ బుక్ మరియు టెక్స్ట్ పుస్తకాలు, ఆక్స్ఫర్డ్ మరియు ఇతర డిక్షనరీలు, విద్యార్థులకు బ్యాగ్, యూనిఫామ్ , షూ , బెల్ట్ పంపిణీ తదితర సౌకర్యాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సమగ్ర శిక్ష అభియాన్ కు అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి నిర్వహిస్తున్నాం. మన బడి - మన భవిష్యత్తు - పీఎం శ్రీ యోజన: మోడల్ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో మరియు పీఎం శ్రీ 36 స్కూళ్లలో విద్యార్థుల ఆరోగ్యం లక్ష్యంగా సురక్షిత త్రాగు నీరు, స్వచ్ఛత కోసం మరుగుదొడ్లు, భవనాల మరియు ఫర్నిచర్ ఆధునీకరణ నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా విద్యార్థుల ఆరోగ్య భద్రత మరియు పరిసరాల పరిశుభ్రత ధ్యేయంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్వహించ బడుతున్నాయి. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో పీఎం శ్రీ పాఠశాలలు నిర్వహించడం జరుగుతుంది. త్వరలో జిల్లా లో ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుందని అన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం - పీఎం పోషణ్ : నాణ్యమైన సన్న బియ్యంతో జిల్లాలో జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని 2,129 పాఠశాలలో 1.30 లక్షల విద్యార్థులు ఉండగా, అందులో 1.17 లక్షల మంది విద్యార్థులకు వారంలో 5 రోజులు కోడి గుడ్డుతో పౌష్టికాహార మధ్యాహ్నం భోజనం కేంద్ర ప్రభుత్వం పథకం పీఎం పోషణ తో అనుసంధానంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం మన జిల్లాలో అమలు అవుతుంది. స్కూల్ హెల్త్ & వెల్నెస్ ప్రోగ్రామ్ : ఆరోగ్య మరియు విద్యా శాఖ సమన్వయంతో కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ అమలు కింద హెల్త్ స్క్రీనింగ్, పోషక విలువలతో కూడిన మాత్రలు, ఆరోగ్య పరీక్షలు మరియు అవగాహన కార్యక్రమాలు ముందస్తు వ్యాధినిరోధక చర్యలు ధ్యేయంగా చేపడుతున్నాం. జిల్లాలో విద్యార్థులకు ఈ సేవలు అందుతున్నాయ. జవహర్ బాల ఆరోగ్య రక్ష : విటమిన్ A మరియు D టాబ్లెట్లు సంవత్సరానికి రెండు సార్లు, ఐరన్ మరియు పోషక విలువలు తగ్గి రక్తహీనత ఉన్న విద్యార్థులకు తగిన పోషక విలువలను అందించే కార్యక్రమం జరుగుతుంది. స్వ‌ర్ణాంధ్ర సాధ‌న‌కు సుర‌క్షిత తాగునీరు కూడా ఒక కీల‌క అంశ‌మ‌ని.. జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌కు సంబంధించి మొత్తం ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుకుంటూ ముందుకెళ్ల‌డం జ‌రుగుతోంద‌ని, పరిస్థితులకు అనుగుణంగా అధికారులు సరైన సమాచారం, ప్రణాళికలతో సిద్ధం కావాలని సూచించినట్లు తెలిపారు. జిల్లాలో అమృత్ 1.0 కింద చేపట్టిన పనులు పురోగతి. చేయవలసిన మిగిలిన పనులు మరియు అదేవిధంగా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగానూ తాగునీటి సరఫరా ప్రణాళికలు అమృత్ 2.0 సిద్ధం చేయాలని అధికారుల‌కు సూచించినట్లు పేర్కొన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం అమల్లోనూ వేగం పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లాను అన్ని రంగాల అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్ది వెనుకబాటు తనాన్ని పారదోలి ప్రధాని నరేంద్ర మోడీ జీ సంకల్పం వికసిత్ భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్రప్రదేశ్ లో అన్నమయ్య జిల్లా భాగస్వామ్యం అయ్యేలా అధికారులు భాద్యతలు నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి పథకాల సమర్థవంతమైన అమలు ద్వారా జిల్లాను సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పీఎం కుసుమ్ పథకం కింద జిల్లా పునర్విభజన అనంతరం 19 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్రాజెక్టు స్థాపనకు 50 ఎకరాల భూమిని గుర్తించడం జరిగిందని, అదనంగా మరో 11 మెగావాట్ల సామర్థ్యం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పీఎం సూర్య ఘర్ యోజన పథకం అమలులో భాగంగా టెండర్ల ప్రక్రియ పూర్తికి సమీపంలో ఉందని , వచ్చే వారం నుండి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఎంజిఎన్ఆర్ఇజిఎస్ (ఉపాధి హామీ పథకం) ద్వారా నిర్దేశిత లక్ష్యాలను సమర్థవంతంగా సాధిస్తూ, నీటి సంరక్షణ పనులు, సీసీ రోడ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద జిల్లాలో సుమారు 350 పనులు పురోగతిలో ఉండగా, వాటి అంచనా వ్యయం రూ.30 నుండి 40 కోట్ల వరకు ఉందని, ఈ పనులను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం కింద రూ.160 కోట్లతో రూపొందించిన యాక్షన్ ప్లాన్‌కు రాష్ట్ర స్థాయి అధికారుల ఆమోదం లభించిందని, ఇందులో మైక్రో ఇరిగేషన్ మరియు హార్టికల్చర్ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.అమృత్ 2.0 పథకం ద్వారా పుంగనూరు, మదనపల్లి మరియు పలమనేరు మున్సిపాలిటీలలో తాగునీటి ప్రాజెక్టులు మంజూరై, ప్రస్తుతం డిజైన్ల తయారీ తుది దశలో ఉండగా, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో అమలవుతున్న అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి, వాటి ప్రయోజనాలను ప్రజలకు సమర్థవంతంగా చేరేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష మాట్లాడుతూ... పీఎం సూర్య ఘర్ యోజన పథకం ద్వారా జిల్లాలో పంచాయతీలకు, గ్రామ సచివాలయాలకు పైలెట్ ప్రాజెక్టు క్రింద ఏర్పాటు చేయడం జరిగిందని తద్వారా రూ. 1500 నుండి రూ.2000 రూపాయల వరకు కరెంట్ బిల్లులు ఆదా చేయడం జరుగుతున్నదని, ఈ విషయాన్ని ప్రజలలో మరింత అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్యవంతులని చేసి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు లాభం చేకూరి విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై ప్రజలలో అధికారులు మరింత అవగాహన కార్యక్రమాలను చేపట్టి ప్రభుత్వం నుండి అందే ఫలితాలను పట్టణ,మండల, గ్రామస్థాయి ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ అనుబంద శాఖాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ , డి.సి.హెచ్.ఎస్, డ్వామా, తదితరల సంబందిత జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది తదితరలు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :