నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కుల వ్యవస్థపై పోరాడిన విప్లవ వనిత సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం. 1848లోనే అక్షర సేద్యం చేసిన ధీరవనిత సావిత్రిబాయి పూలే. బహుజన సేన- చిత్తూరు జిల్లా కమిటీ సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా కుప్పం పట్టణ అంబేద్కర్ సర్కిల్ మరియు శాంతిపురం అంబేద్కర్ సర్కిల్ లో తొలి చదువుల తల్లి,భారతీయ సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే చిత్ర పటానికి, బహుజన సేన చిత్తూరు జిల్లా మరియు కుప్పం నియోజకవర్గం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన సేన జిల్లా అధ్యక్షులు బుర్ర సతీష్ మాట్లాడుతూ మహిళలు విద్యా రంగంలోను అన్ని రంగాలలో సమాన హక్కులు అవకాశాలు కల్పించాలని సావిత్రిబాయి ఫూలే ఎన్నో పోరాటాలు చేశారని.తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించారని. ఆమె ఆధునిక భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు.పీడిత ప్రజల ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి SSM.శివకుమార్, కుప్పం నియోజకవర్గ అధ్యక్షులు మహేష్,అధికార ప్రతినిధి వేణు,శాంతిపురం మండల అధ్యక్షులు జై చంద్ర, అధికార ప్రతినిధి మంజునాథ్, యూత్ అధ్యక్షులు శ్రీనాథ్ బాబు,బహుజన సేన నాయకులు గోపి, తుమ్మసి సుబ్రహ్మణ్యం,మురళి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News