Sunday, 13 September 2026 04:47:10 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

నిస్వార్ధమైన ప్రజాసేవకుడు కమ్మల రఘు

పుట్టినరోజు వేళ కొనియాడిన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

Date : 14 January 2026 06:43 PM Views : 263

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజకీయాలలో నిస్వార్ధమైన ప్రజాసేవకుడు కమ్మల రఘు అని టిడిపి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ప్రశంసించారు. బుధవారం టిడిపి యువ నాయకుడు కమ్మల రఘు పుట్టినరోజు వేడుకలు చంద్రాకాలనీలోని ఆయన స్వగృహంలో పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ అనుచరుడిగా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన రఘు కు శ్రీరామ్ చినబాబుతో పాటు పాలయేకరి సంఘం నాయకులు యాలగిరి దొరస్వామి నాయుడు, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ దేవరింటి శ్రీనివాసులు, రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శి మేకల రెడ్డిశేఖర్ మదనపల్లి నియోజకవర్గ ఐటిడిపి అధ్యక్షులు కాశీ శ్రీరామ్ వాల్మీకి, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ నాయకులు మంగళ ప్రభాకర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, తెలుగుయువత నాయకులు ప్రకాష్ నాయుడు, మైనారిటీ నాయకులు షేక్ సికిందర్ బాషా, తెలుగుదేశం సీనియర్ నాయకులు పసుపులేటి శ్రీనివాసులు,లైఫ్ కేర్ రాజశేఖర్, బంధుమిత్రులు,స్నేహితులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కమ్మల రఘు ను శాలువా, పూలమాలలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రఘు పార్టీ పటిష్టతకు ఎంతో‌ కృషి చేశారన్నారు. అనతి కాలంలోనే యువ నాయకుడిగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు కష్టమొస్తే క్షణం ఆలోచించకుండా వారికి అండగా నిలుస్తున్నాడని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. అందరిని చిరునవ్వుతో పలకరించే మనస్తత్వం, తనతోపాటు తన చుట్టూ ఉన్నవారు బాగుండాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న కమ్మల రఘు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.ఆయన జన్మదిన వేడుకలలో పలువురు నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: