Saturday, 12 September 2026 02:42:06 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

మదనపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

నూతన కార్యవర్గం కు పలువురు శుభాకాంక్షలు

Date : 02 September 2026 05:19 PM Views : 103

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవం - శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులు మదనపల్లె : ఇటీవల పట్టణంలో మార్పూరి వీధిలోని శీనా టీస్టాల్ ఎదురుగా ఏర్పాటైన మదనపల్లి ప్రెస్ క్లబ్ నూతన ప్రధాన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఇందులో మదనపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి,గౌరవ సలహాదారుగా సిరివేలు చరణ్ కుమార్,అధ్యక్షుడిగా నక్కింటి రవీంద్ర,కార్యదర్శిగా మోడెం శ్రీనివాసరావు,కోశాధికారిగా నానబాల కుమార్ లను ఎన్నుకున్నారు.ఇందుకు మదనపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు ఆమోదం తెలిపారు.ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు అప్పినపల్లి భాస్కరాచారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మదనపల్లి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం తనను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు.పాత్రికేయ వృత్తి ఎంతో ఉన్నతమైందని సమాజంలో జరిగే పరిణామాలను ప్రజలకు వివరిస్తూ నిస్వార్ధమైన సేవలందించడంలో ముందుంటారని కొనియాడారు.సమిష్టి కృషితో మదనపల్లి ప్రెస్ క్లబ్ అభివృద్ధికి బాటలు వేద్దామని పిలుపునిచ్చారు.అనంతరం గౌరవ సలహాదారు సిరివేలు చరణ్ కుమార్ మాట్లాడుతూ మహోన్నత ఆశయం,సమాజానికి మంచి చేయాలనే సదుద్దేశంతో ఏర్పాటైన మదనపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారుడిగా తనను నియమించడం ఆనందంగా ఉందన్నారు.మదనపల్లె ప్రెస్ క్లబ్ పాత్రికేయుల సంక్షేమం అభ్యున్నతికి తన సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు.పాత్రికేయ వృత్తిలో తనకు అనుభవం తక్కువే అయినప్పటికీ ఈ రంగంలో తనకు అందరూ సన్నిహితులేనన్నారు.సమాజంలోని సమస్యలను,లోటుపాట్లను నిర్భయంగా ప్రచురించి ప్రజల పక్షాన కలం గళం వినిపించాలని ఆయన సూచించారు.మదనపల్లి ప్రెస్ క్లబ్ దినదినాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.నూతన అధ్యక్ష,కార్యదర్శి,కోశాధికారులు మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతగా నిర్వర్తిస్తామని,మదనపల్లి ప్రెస్ క్లబ్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని,పాత్రికేయుల సమస్యలపై పోరాటం చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడంలో మదనపల్లి ప్రెస్ క్లబ్ ను ముందు వరుసలో నిలుపుతామని వెల్లడించారు.తమకు ఈ అవకాశం కల్పించిన మదనపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం సభ్యులు నూతన ప్రధాన కమిటీని శాలువాలతో ఘనంగా సన్మానించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: