నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 18 ః యువకులు అసాంఘిక కార్యక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని తంబళ్లపల్లె ఎస్సై టి అనిల్ కుమార్ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం పరసతోపు పంచాయతీ ఏటిగడ్డ పల్లెలో ప్రజలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జూదాలు, కోడి పందాలు నిర్వహిస్తే సహించేది లేదని గంజాయి వాడకం ఆరోగ్యానికి హానికరమని అదే విధంగా మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేని ప్రయాణం, చిన్నారుల చేతికి వాహనాలు ఇవ్వరాదని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే తమ దృష్టికి వేస్తే వెంటనే పరిష్కారానికి ముందు ఉంటామన్నారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News