Sunday, 13 September 2026 07:10:13 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

బాధితుల సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యత అన్నమయ్య - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 25 May 2026 09:01 PM Views : 103

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 25 : ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో స్పష్టంగా తెలుసుకొని, వాటిని చట్టపరిధిలో విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ప్రజల వద్ద నుండీ అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ గారు నేరుగా ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను విన్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఆయా సమస్యలపై తక్షణమే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ డివిజన్, సర్కిల్, మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఎస్పీ గారు ఈ సందర్భంగా పోలీసు అధికారులను ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, వారి సమస్యలను పూర్తిగా విని చట్ట పరిధిలో సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు, మరియు మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ, సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దూరప్రాంతాల నుండి వచ్చే ఫిర్యాదుదారులకు పోలీస్ కార్యాలయ సిబ్బంది ప్రత్యేకంగా సహాయక సహకారాలు అందించి, వారు ప్రశాంతమైన వాతావరణంలో తమ సమస్యలను వివరించుకునేలా చొరవ చూపారు. సమస్య తీవ్రత ఎలాంటిదైనా సరే, చట్ట పరిధిలో పూర్తిస్థాయి విచారణ జరిపి నిర్ణీత గడువు లోపల ఖచ్చితమైన పరిష్కారం అందించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని ఎస్పీ గారు పేర్కొన్నారు. బాధితులు తమ సమస్యల పట్ల ఎలాంటి అధైర్యానికి లోనుకాకుండా, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు సమర్పించి న్యాయం పొందవచ్చని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఈ సందర్భంగా ప్రజలకు భరోసా కల్పించారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :