నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని చౌడేశ్వరి సర్కిల్ సమీపం నీరుగట్టువారిపల్లిలో వెలసిన శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దండు రామాంజులు సిల్క్ సారీస్, మాజీ కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టి ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు నిర్వహించగా, పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా అన్నదాన ఏర్పాట్లు చేసి, సుమారు 4 వేల నుంచి 5 వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. స్వచ్ఛంద సేవకులు, నిర్వాహకులు సమన్వయంతో భక్తులకు క్రమపద్ధతిలో భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, దండు రామాంజులు మాట్లాడుతూ...మహాశివరాత్రి వంటి పవిత్ర పర్వదినాల్లో అన్నదానం చేయడం గొప్ప పుణ్యకార్యమని తెలిపారు. భక్తులకు సేవ చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, చేనేత కార్మిక యూనియన్ ప్రెసిడెంట్ ముష్టూరు రామ్మోహన్, కదిరి రామ్మోహన్, చెంగల సుబ్రహ్మణ్యం, దండు ఆనంద్ తదితరులు పాల్గొని అన్నదాన సేవలో చురుకుగా పాల్గొన్నారు.
Reporter
Namitha News