Sunday, 13 September 2026 11:02:10 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

పోర్డ్ సంస్థ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవ వారోత్సవాల ముగింపు సమావేశము

Date : 20 November 2025 05:32 PM Views : 195

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పోర్డ్ సంస్థ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవ వారోత్సవాల ముగింపు సమావేశము ఈరోజు బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా బాలల హక్కుల వారోత్సవాల ముగింపు సమావేశము ఫోర్డ్ సంస్థ ఆధ్వర్యంలో నేడు స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు విచ్చేసి ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వము విద్యార్థుల విద్య కోసం అనేక సౌకర్యాలు కల్పించడం బాలల హక్కుల్లో ఒక భాగమేనని మీకున్న హక్కులను మీరు సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ సందర్భంగా విశిష్ట అతిథి బ్యాంక్ ఆఫ్ బరోడా అసిస్టెంట్ మేనేజర్ శ్రీ కోటి రెడ్డి గారు మాట్లాడుతూ తన జీవిత అనుభవాలను క్రమశిక్షణతో చదువు సంస్కారం వాటంత టవే వస్తాయన్నారు ఈ సందర్భంగా శ్రీ రామ్మూర్తి సార్ గారు మాట్లాడుతూ బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో సంరక్షణ అనేవి జీవితములో చాలా ముఖ్యమైనవని, మనం చుట్టూ ఉన్న సమాజంలో అనేక సమస్యలు, సవాళ్లు మనకు ఎదురైతుంటాయి వాటిని అధిగమించి, మీ లక్ష్యాలు చేరుకొరేవరకు మీ ప్రయత్నం కొనసాగాలని తెలిపారు. ఈ కార్యక్రమం సభాధ్యక్షులు శ్రీమతి జల్లా లలితమ్మ గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా ఐక్యరాజ్యసమితిలో జరిగిన తీర్మానంలో అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారు భారతదేశం కూడా బాధ్యత వహిస్తుందని బాలల రక్షణ పరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఐక్యరాజ్యసమితిలో జరిగిన తీర్మానంలో సంతకం చేయడం జరిగిందని బాలలుగా మీకున్నటువంటి హక్కులను సంపూర్ణంగా మీరు వినియోగించుకొని మీ లక్ష్యాలను మీరు చేరుకునే వరకు మీ పయనం కొనసాగాలని అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు మన ప్రభుత్వం కల్పించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా గత వారం రోజులుగా అన్ని పాఠశాలల్లోనూ కాలనీలలోనూ బాలల సంఘాల పిల్లల చేత అనేక రకాల కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగిందని ఈ కాంపిటీషన్స్ ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీసి వారు సస్టైనబులిటీ అవ్వడానికి మరియు వారికున్న బలాలను బలహీనతలను గుర్తించి సరైన మార్గములో మీరు పయనించడానికి ఉపయోగపడేటట్లు ఉంటాయని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ సార్ గారు మాట్లాడుతూ ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు మా పాఠశాలలో నిర్వహించి మా పిల్లలకు చదువు పట్ల ఆసక్తిని పెంచుటకు ప్రయత్నం చేసినందుకు పోర్డు సంస్థ, వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ వుత్తన్న సార్ గారు ఫోర్డ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ నిర్మల, ఎం ఐ ఎస్ సుభాషిని మరియు జయలక్ష్మి, స్వర్ణకుమారి, జలజ,అల్తాఫ్, నరసింహ ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :