Wednesday, 29 July 2026 10:14:31 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

క్రికెట్ అడాడు, ఇంటికొచ్చాక అశ్వస్థత, గుండెపోటు తో యువకుడు మృతి

చౌడేపల్లి మండలం ఎగువమల్లెల గ్రామం లో విషాదచాయలు

Date : 11 May 2026 10:05 AM Views : 332

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి -మే 11 : గుండెపోటు తో యువకుడు మృతి చెందిన ఘటన చౌడేపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది . కుటుంబీకుల కథనం మేరకు వివరాలు... మండలంలోని పరికిదొన పంచాయతీ ఎగువమల్లెల వారి పల్లికి చెందిన శ్రీనివాసులు కుమారుడు వెంకటేష్ (30) రెండు నెలల ముందు స్థానిక అపోలో మెడికల్స్ లో పనిచేస్తూ ఇటీవల పనికి నిలిచిపోయి, వ్యవసాయ పనులు, కేటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మిత్రులు, సమీప బంధువులతో కలసి ఆదివారం ఆటవిడుపుగా కొంత సేపు క్రికెట్ ఆడాడు. తర్వాత ఇంటికి వచ్చి చల్లని నీటితో స్నానం చేసి, భోజనం చేశాడు. క్రికెట్ ఆట నుంచి ఇంటికి వచ్చే టప్పుడు గుండెలో పట్టేసినట్లు ఉందని మిత్రులకు చెప్పినట్లు తెలిపారు. అన్నం తిన్న తర్వాత చాతి నొప్పి ఎక్కువ కావడంతో అక్కడే కిందకి పడిపోయాడు. వెంటనే మిత్రుని పిలుచుకొని చౌడేపల్లి కు ద్విచక్ర వాహనంలో వెళ్లారు .అక్కడో ఆర్ఎంపీ డాక్టర్ కు చూపించారు. నొప్పి తగ్గకపోవడంతో 108 వాహనంలో స్థానిక పి హెచ్ సి తరలించారు. స్థానిక పి హెచ్ సి లో వైద్య సిబ్బంది 108 వాహనంలోనే పరీక్షలు చేయగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కాగా వెంకటేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి ఆటోల కోసం ప్రయత్నించిన ఒక్కరు కూడా రాలేదు. వెంకటేష్ స్వగ్రామంలోనే పలువురు ఆటోలు ఉన్న అతని ఎగువమల్లెలవారి పల్లెకు చేర్చడానికి ఒక్క వాహనం కూడా రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో అతని మిత్రులు ద్విచక్ర వాహనంలోనే వెంకటేష్ మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. తీరా ఇంటికి చేర్చిన వెంకటేష్ కు కొందరు యువకులు నీళ్లు తాపించి, సిపిఆర్ చేయగా వామిట్ అయిందని, ఊపిరి ఆడుతుందని, తిరిగి మదనపల్లె ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పల్స్ లేవని నిర్ధారించడంతో వెంకటేష్ మృతదేహాన్ని తిరిగి ఎగువమల్లెలవారి పల్లెకు చేర్చారు.మృతుడికి ఇంకా పిల్లలు లేరు గర్భవతి అయిన భార్య ఉంది.దీంతో గ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి. బంధువులు,మిత్రులు ఆటోలు ఉన్నా వెంకటేష్ మృతదేహాన్ని స్వగ్రామం కు చర్చేందుకు ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం, ద్విచక్ర వాహనంలో మృతదేహాన్ని తీసుకుపోవడం చాలా బాధాకరం గ్రామస్తులు వాపోతున్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :