నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 17 : తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లి పంచాయతీ దండువారిపల్లె కు చెందిన పాడి రైతు వంకోళ్ల చిన్న వెంకటరమణ కు చెందిన సుమారు రూ 70వేల విలువ చేసే పాడి ఆవు జబ్బ వాపు వ్యాధితో మృతి చెందింది. పాడిఆవు గత నాలుగు రోజులుగా తీవ్ర స్వస్థతకు గురై స్థానిక కన్నెమడుగు పశు వైద్య డాక్టర్ విక్రమ్ రెడ్డి, జె విఓ శ్రీనివాసులు వైద్య చికిత్సలు అందించిన ఫలితం లేక శనివారం ఉదయం ఆవు చనిపోయింది. జీవనాధారమైన పాడియావు మృతి చెందడంతో వెంకటరమణ కుటుంబం తీవ్ర ఆవేదన కు గురైంది. పాడి ఆవు ఇచ్చే పాల దిగుబడితో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని స్థానిక రాజకీయ నాయకులు, ప్రజలు కోరుతున్నారు
Reporter
Namitha News