Wednesday, 16 September 2026 12:53:41 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

మిట్స్ లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఫర్ లెర్నింగ్ ప్రోగ్రాం

ముఖ్య అతిధిలు గా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ సి.పి రవికుమార్, మలేషియా కు చెందిన డాక్టర్ రాష రజేబ్ అతల్లాహ్, జపాన్ కు

Date : 06 March 2026 10:19 PM Views : 281

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 06 : అంగళ్ళు సమీపం లో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఏఐసిటిఈ, న్యూఢిల్లీ వారి సహకారంతో రెండు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఫర్ లెర్నింగ్ కార్యక్రమంను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బెంగళూర్ కు చెందిన టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ సి.పి రవికుమార్,మలేషియా దేశానికి చెందిన యూనివర్సిటీ అఫ్ మలయా, కంప్యూటర్ సిస్టం అండ్ టెక్నాలజీ విభాగం నందు పనిచేస్తున్న డాక్టర్ రాష రజేబ్ అతల్లాహ్, జపాన్ లోని ది యూనివర్సిటీ అఫ్ ఐజు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాగే ఉదయ్ కిరణ్, పోలాండ్ దేశానికి చెందిన యూ.బి.ఎస్ బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ ప్రోడక్ట్ మేనేజర్ ఈ ఆర్ రాంకుమార్ సెల్వరాజ్ మరియు లు పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ సి.పి రవికుమార్ మాట్లాడుతూ మెషిన్ లెర్నింగ్ మరియు డేటా సైన్స్‌లో పని చేస్తున్న అకాడెమియా మరియు పరిశ్రమలకు చెందిన పరిశోధకులు, ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలను వారి అప్లికేషన్‌లను ఒకచోట చేర్చడానికి ఒక ప్రధాన అంతర్జాతీయ సమావేశం కు నాందిగా ఈ కార్యక్రమం ను ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. నేటి కంప్యూటింగ్ వ్యవస్థలు వేగంగా మరియు సమర్థవంతంగా పనిచేయడానికి ఆప్టిమైజేషన్ పద్ధతులు ఎంతో అవసరమని తెలిపారు. సెమీకండక్టర్ టెక్నాలజీ అభివృద్ధిలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ప్రాసెసింగ్ వేగాన్ని పెంచడం, వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం వంటి అంశాల్లో ఆప్టిమైజేషన్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కార్యక్రమం లో డాక్టర్ రాగే ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ సాంకేతిక రంగం లో ఉండే అనేక మంది పరిశోధకులు ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలు చేస్తున్నారని, మెషిన్ లెర్నింగ్ తో మొదలుకొని, డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో దిన దినాభివృద్ధి జరుగుతున్నాయని, టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు వెళుతున్నాం అని ఆయన అన్నారు. పరిశోధన పత్రాలు ప్రఖ్యాతి పొందిన ఐఈఈఈ లో ప్రచురణ చేయడం వారి కెరీర్ కు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఎంతో మంది పరిశోదలకులు వారి పరిశోధన పత్రాలు ఇక్కడ ప్రదర్శించడం, వారి ఆలోచనలను అందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఎమ్.శ్రీదేవి, కన్వీనర్ డాక్టర్ ఆర్ నిత్య, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :