Monday, 14 September 2026 10:44:52 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ని సందర్శించిన పాలిటెక్నిక్ విద్యార్థులు

Date : 10 December 2025 06:38 PM Views : 196

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 10 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ని సందర్శించిన పలమనేరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల మరియు కదిరి ప్రభుత్వ పోలిటెక్నిక్ కళాశాల యొక్క ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్) మరియు ఈఈఈ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) విభాగాల విద్యార్థులు. యూనివర్సిటీ విజిట్ లో భాగంగా సందర్శించారని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. ఈ పర్యటనలో విద్యార్థులు యూనివర్శిటీ లోని అత్యాధునిక ల్యాబొరేటరీలు, పరిశోధనా విభాగాలు మరియు సాంకేతిక వసతులను సందర్శించడం ద్వారా వారు పరిశ్రమలో జరుగుతున్న నూతన మార్పులు, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పద్ధతులు మరియు ప్రాక్టికల్ ఇంజనీరింగ్ నైపుణ్యాల గురించి లోతైన అవగాహన పొందారని తెలిపారు.ఇలాంటి సందర్శన ద్వారా ఉన్నత విద్య అయిన బీటెక్ మరియు ఎంటెక్ కోర్సులు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుందని, కాలేజీ క్యాంపస్ వాతావరణం, విద్యార్థి జీవితం మరియు కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసి ఉన్నత విద్య పట్ల ఆసక్తి పెరుగుతుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ సీనియర్ లెక్చరర్ దీప తెలిపారు. పరిశ్రమ–అకాడమీ సంబంధాలు, ప్లేస్‌మెంట్లు, ఇంటర్న్‌షిప్ అవకాశాల గురించి తెలుసుకోవడం ద్వారా కెరీర్ ప్లానింగ్ మరింత బలపడుతుంది. అదేవిధంగా ప్రాజెక్టులు, ప్రెజెంటేషన్లు వంటి కార్యక్రమాలను చూసి కమ్యూనికేషన్, టీమ్‌వర్క్ వంటి వ్యక్తిగత నైపుణ్యాలపై అవగాహన పెరుగుతుంది. ఈ పర్యటనలో యూనివర్సిటీ అధ్యాపకులు మరియు సాంకేతిక నిపుణులు విద్యార్థులకు అనేక ఉపయోగకరమైన వివరాలను తెలియజేశారు. ఈ యాత్ర విద్యార్థుల పరిశ్రమ అవగాహనను పెంచి, వారి ఇంజనీరింగ్ రంగంలో భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ పోలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు తెలిపారు. కార్యక్రమంలో విభాగాధిపతులు డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ పవన్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్-అడ్మిషన్స్ డాక్టర్ వి.మారుతీ ప్రసాద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: