Saturday, 12 September 2026 03:31:24 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

సీనియర్ పాత్రికేయుడికి చేయూత - పరామర్శించిన నవజీవన్ వెల్ఫేర్ సొసైటి సభ్యులు

Date : 09 August 2026 04:32 PM Views : 208

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఆగస్టు 09 : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మంచం పట్టిన సీనియర్ పాత్రికేయుడు యుగంధర్ ను‌ నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ అద్యక్షురాలు పద్మావతి, జనరల్ సెక్రటరీ గొంగడి కృష్ణమూర్తి, కోశాధికారి కృష్ణపూజిత లు ఆదివారం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. సొసైటీ తరఫున ఆర్థిక చేయూత అందించారు. యుగంధర్ కు ఆయన భార్య సరస్వతికి ధైర్యం చెప్పి భరోసా అందించారు. పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. క్రమం తప్పకుండా మందులు వాడాలని, ధైర్యంగా ఉండాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సొసైటీ తరఫున మరింత సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని తెలియజేస్తూ కొన్ని రకాల పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో సీనియర్ పాత్రికేయుడు యుగంధర్ తీవ్రంగా గాయపడి కాలు పోగొట్టుకోవడం దురదృష్టకర‌మన్నారు. ప్రభుత్వం ఈ కేసును త్వరగా పరిష్కరించి, బాధితునికి తగు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి తగు ఆర్థిక సాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. వీలైతే భాదితునికి గాని అతని భార్యకు గానీ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని కోరారు. త్వరగా కోలుకొని తిరిగి పాత్రికేయ వృత్తిలో కొనసాగాలని ఆకాంక్షించారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :