Tuesday, 15 September 2026 09:48:05 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం సీటా - 2K26

అమెరికన్ సొసైటీ సివిల్ ఇంజనీర్స వారి ఆధ్వర్యంలో సీటా 2k26

Date : 07 March 2026 10:26 PM Views : 359

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 07 : అంగళ్ళు సమీపం లో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగము వారు అమెరికన్ సొసైటీ సివిల్ ఇంజనీర్స్ (ASCE) మిట్స్ స్టూడెంట్స్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "సీటా - 2K26" ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లె కు చెందిన ఆరన్ సైంటిఫిక్ కంపెనీ, సి ఈ ఓ డాక్టర్ నంద కిషోర్ నాయిని పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ నిర్మాణ రంగంలో ప్రముఖ ఇంజినీర్ అయిన సర్ మోక్షగుండం విస్వేస్వరయ్య దేశ అభివృద్ధిలో చేసిన విశేష సేవలను కొనియాడారు. ప్రకృతి నుండి ప్రేరణ పొందుతూ ఇంజినీరింగ్‌లో కొత్త పరిష్కారాలను ఎలా రూపొందించవచ్చో వివరించారు. భవిష్యత్తులో సివిల్ ఇంజినీరింగ్ రంగంలో రాబోయే సాంకేతిక ఆవిష్కరణల గురించి మాట్లాడుతూ స్వయంగా పగుళ్లు నయం చేసుకునే కాంక్రీట్ మరియు భవనాల్లో పర్యావరణానికి అనుకూలమైన విద్యుత్ వినియోగం తక్కువగా ఉండి, పర్యావరణానికి హాని చేయని, శక్తిని ఆదా చేసే విధంగా పనిచేసే ఎయిర్ కండిషనింగ్ పద్ధతుల వంటి సాంకేతికతలు భవిష్యత్తు నిర్మాణాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞాన రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, శాస్త్రీయంగా రూపకల్పన చేయబడిన నిర్మాణాలు, వంతెనలు, రహదారులు, నీటి పారుదల వ్యవస్థలు, పట్టణ ప్రణాళిక – ఇవన్నీ సివిల్ ఇంజనీరింగ్ రంగానికి చెందినవన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సివిల్ ఇంజనీర్లు భవిష్యత్తు అవసరాలను తీర్చగల మౌలిక నిర్మాణాలను రూపొందిస్తున్నారు అని, డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (BIM) వంటి నూతన సాంకేతికతలు సివిల్ ఇంజనీరింగ్ రంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చాయన్నారు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ ఈ జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం కు దేశ నలుమూలల నుంచి సుమారు 150 మంది విద్యార్థులు టెక్నికల్ పేపర్ ప్రెజెంటేషన్, ప్రాజెక్ట్ ఎక్సపో, ఆటో క్యాడ్ డ్రాయింగ్ మరియు వెబ్ డిజైనింగ్ ఈవెంట్‌ లలో పాల్గొనడానికి వచ్చారని అని అన్నారు. కార్యక్రమంలోప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్-స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్, విభాగాధిపతి డాక్టర్ విజయ కుమార్ నటేశన్, కోఆర్డినేటర్ డాక్టర్ ఇమ్రాన్ కుటాగుళ్ల, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :