Saturday, 12 September 2026 04:30:55 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

త్యాగధనుడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితం యువత ఆదర్శం గా తీసుకోవాలి

కలెక్టరేట్ లో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు

Date : 23 August 2026 03:09 PM Views : 81

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్టు 23 : ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి అడుగుజాడలు అందరికీ ఆదర్శం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు154 వ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముందుగా టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ... త్యాగధనుడు ఆంధ్రకేసరి జీవితం యువతకు ఆదర్శం మని వీరు స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో... తన చొక్కా చించి ధైర్యంగా రొమ్ము చూపించి ధైర్యముంటే కాల్చమని బ్రిటిష్ పోలీసులకు సవాలు చేసిన ధీశాలి అని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజాసేవలో తన జీవితాన్ని దార పోసిన మహనీయుడని అన్నారు.ఒక మారుమూల గ్రామం నుండి చదువుకొని న్యాయవాది వృత్తి చేపట్టి, అనంతరం స్వరాజ్యం అనే దినపత్రిక తెలుగు తమిళ సంచికలలో ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు  కృషిచేసి, మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తుపాకి గుండుకు తన గుండెను ఎదురొడ్డి స్వేచ్ఛా స్వతంత్రాల కోసం గర్జించి, జగతిని జాగృతం చేసి యువతలో స్వాతంత్ర ఉద్యమకాంక్షను రగిలించిన త్యాగధనులు ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించిన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారి జయంతి జరుపుకోవడం గర్వించదగ్గ విషయం అన్నారు.ఆయన అడుగుజాడలే ఆదర్శంగా ప్రతి ఒక్కరూ దేశభక్తి, క్రమశిక్షణతో మెలిగి మంచి పౌరులుగా రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు

ఈ కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డి.ఆర్.ఓ వెంకటేశు,హౌసింగ్ పిడి రమేష్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో శ్రావణి,మదనపల్లి ఎం.ఆర్.ఓ మాధవి, కలెక్టరేట్ లోని వివిధ సెక్షన్ ల సూపరింటెండెంట్లు, కలెక్టర్ కార్యాలయపు సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :