Monday, 14 September 2026 09:50:29 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

విశ్వం స్కూల్ లో సీనియర్ మెన్ అండ్ ఉమెన్ నెట్ బాల్ ఎంపికలు

Date : 19 December 2025 03:40 PM Views : 202

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : *విశ్వం స్కూల్ సీబీఎస్ఈ లో ఘనంగా నిర్వహించిన సీనియర్ మెన్ అండ్ ఉమెన్ నెట్ బాల్ ఎంపికలు* అభినందించిన విశ్వం విద్యాసంస్థల చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు విశ్వం స్కూల్ సీబీఎస్ఈ లోని ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిసెంబర్ 18.12. 25 మధ్యాహ్నం 2 గంటలకు సీనియర్ మెన్ అండ్ ఉమెన్ ఎంపికలు నిర్వహించడం జరిగింది. జిల్లా జట్టు కోసం ప్రతిభావంతులైన నెట్ బాల్ ఆటగాళ్లను గుర్తించడం ఈ ఎంపిక కార్యక్రమం లక్ష్యం. వివిధ పాఠశాలల నుంచి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ వయసు ఉన్న విద్యార్థులు పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించి జిల్లా స్థాయి జట్టులో స్థానం కోసం పోటీ పడ్డారు. నెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ డి. శ్రీనివాసులు రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ క్యాంపస్ లోని ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని ప్రశంసించారు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి అన్నమయ్య జిల్లా పిఈటి,పిడి అసోసియేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్ శ్రీ రమేష్ బాబు మరియు ఫిజికల్ డైరెక్టర్ రెడ్డి వరప్రసాద్ గారు క్రీడాకారులను ఉత్సాహంగా పాల్గొనేందుకు ప్రోత్సహించారు. విశ్వం స్కూల్ సీబీఎస్ఈ ప్రిన్సిపాల్ అయినటువంటి రోజ్లిన్ ప్రియా గారు పిల్లలందరినీ ప్రోత్సహిస్తూ విద్యార్థులను ఉద్దేశించి ఆటల ప్రాముఖ్యత వివరించి పిల్లలందరూ విజయం సాధించారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంతో విశ్వం స్కూల్ సీబీఎస్సీ యువ క్రీడాకారులను తమ సామర్ధ్యాలను ప్రదర్శించడానికి ఒక వేదికను అందించింది. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు తూర్పుగోదావరి జిల్లాలో రావులపాలెంలో 27.12.25 నుండి 28.12.25వ తేదీలలో జరగనున్నాయి. ఈ క్రీడా కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థులు బాలురు విభాగం-భరత్, ఇమ్రాన్, సౌఖత్ ,తులసి కుమార్ రెడ్డి, వీర రాఘవరెడ్డి, కాసిమ్, విశాల్, హమీద్ ,హుస్సేన్, హర్ష, రవితేజ, రాకేష్ ,చిన్న చెంచు, జాఫర్, వెంకటరత్నం. బాలికల విభాగం-సాయా రంజిత్, ఐశ్వర్య, హదీ సున్, తేజశ్రీ ,యజ్ఞశ్రీ, హారిక, జోహార్, అలేఖ్య, మేఘన, ముస్కాన్, ఐషా భాను, అపర్ణ,నజియా, ప్రహలక్ష్మి, రిజ్వానా భాను. ఎంపికైన క్రీడాకారులను విశ్వం విద్యాసంస్థల అధినేత శ్రీ ఎం.ప్రభాకర్ రెడ్డి గారు ప్రసంగిస్తూ క్రీడాకారులను అభినందించడం జరిగింది.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :