నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 04 : శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మదనపల్లె పట్టణంలోని అనపగుట్ట గోవర్ధనగిరిపై వెలసిన శ్రీకృష్ణ ఆలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణడి కి ప్రత్యేక అర్చనలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు అనూషా రెడ్డి , మాజీ మున్సిపల్ చైర్మన్ మనుజా రెడ్డి, జింకా చలపతి తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News