Wednesday, 29 July 2026 10:58:15 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

జూలై 7న 'ఛలో విజయవాడ'ను జయప్రదం చేయండి

Date : 28 June 2026 06:00 PM Views : 102

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించాలి – జూలై 7న 'ఛలో విజయవాడ'ను జయప్రదం చేయండి మదనపల్లి: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూలై 7న నిర్వహించనున్న "ఛలో విజయవాడ" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మదనపల్లి మున్సిపాలిటీలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్రి సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. కార్మికులపై పనిభారం పెరిగి అనారోగ్యాల బారిన పడుతున్నారని, ప్రభుత్వానికి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయిందన్నారు. జూన్ 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఆందోళనలు చేపట్టామని, జూలై 7న విజయవాడలో భారీ స్థాయిలో నిరసన చేపడతామని తెలిపారు. గత ప్రభుత్వాల వరకు పదవీ విరమణ పొందిన లేదా మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించే ఆనవాయితీ ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం దానికి స్వస్తి పలికిందన్నారు. ఆప్కాస్ నమోదు ప్రక్రియను నిలిపివేసి దానిని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీంతో కార్మికుల పనిభద్రత, వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి హక్కులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణాల విస్తరణకు అనుగుణంగా కార్మికుల నియామకాలు చేపట్టకుండా ఉన్నారని, కరోనా సమయంలో విధుల్లోకి తీసుకున్న డైలీవేజ్ కార్మికులకు ప్రభుత్వం నిర్దేశించిన వేతనాలు కూడా అందడం లేదన్నారు. పర్మినెంట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు గ్రాట్యుటీ అమలు చేయకపోవడం, 12వ పీఆర్సీ ప్రకటించకపోవడం, సంక్షేమ పథకాలు అందించకపోవడం కార్మిక వ్యతిరేక విధానాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ రంగ సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించి, మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేంద్ర, సీనియర్ నాయకులు మస్తాన్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులందరూ దశలవారీ ఆందోళనల్లో పాల్గొని జూలై 7న జరిగే "ఛలో విజయవాడ" కార్యక్రమానికి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు తిరుమలప్ప, ఇంద్రాణి, అల్లా బక్షు, రాధా, జానకమ్మ, కదిరప్ప, మల్లికార్జున, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :