Sunday, 13 September 2026 11:22:12 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

అన్నదాత సుఖీభవ మూడో విడత విడుదల – జిల్లాలో 1.88 లక్షల రైతులకు రూ.108 కోట్లు జమ

చెరువుల పునరుద్ధరణతో సాగునీరు పెంపు – రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రభుత్వం - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 13 March 2026 10:40 PM Views : 330

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - మార్చి 13 : జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి అందాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇందులో భాగంగా జిల్లాలో మూడవ విడత కింద జిల్లా లో రూ.1,88,408మంది రైతులకు రూ.108 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాయచోటి మాసాపేట లోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నందు ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ 2025-26 మూడవ విడత కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం సమీపంలోని మాదాల వారి గూడెం నందు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని వర్చువల్ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి లాంచనంగా ప్రారంభించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని వీక్షించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రాయలసీమ ప్రాంతంలో కరువు జిల్లాగా ఉందని ప్రతి సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉంటుందని కాబట్టి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన నదుల అనుసంధానం కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని స్వర్ణాంధ్ర - 2047 లోని దాదాపు 10 సూత్రాలను ఆధారంగా ప్రాజెక్టు జలధార కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రోజుకు సుమారు 20 వేల నుండి 30 వేల వరకు కార్మికులు అందుబాటులో ఉండటంతో చెరువుల పునరుద్ధరణ, ఫీడర్ కాలువల శుభ్రపరిచే పనులు, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో దాదాపు 70 వరకు పనులను గుర్తించి, అవసరమైన చోట్ల మెషిన్ల సహాయంతో శుభ్రపరిచే పనులు నిర్వహించారు. ఈ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు బడ్జెట్ కోరలేదని, జిల్లాలో అందుబాటులో ఉన్న నిధులతోనే సుమారు రూ.1 కోటి 70 లక్షల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రతి మండలంలోని అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో , ఇరిగేషన్ అధికారులు కలిసి చెరువులకు నీరు చేరే విధంగా కార్యాచరణ రూపొందించామని, ఫలితంగా జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలలో నీరు నిల్వ ఉండే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇటీవల వచ్చిన రెండు సార్లు కురిసిన అకాల వర్షాల కారణంగా కురిసిన వర్షాలను సమర్థవంతంగా నిల్వ చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సాధారణంగా పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించాలంటే వేల కోట్ల రూపాయలు, భూసేకరణ మరియు అనేక సంవత్సరాల సమయం అవసరం అవుతుందని, కానీ తక్కువ వ్యయంతో ఫీడర్ ఛానల్స్ శుభ్రపరిచే కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. గత ఏడాది ఆగస్టు నెలలో జిల్లాలో ఉపరితల జలాలు కేవలం 3 టిఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం అవి 14 టిఎంసీలకు పెరిగాయి. అంటే 11 టిఎంసీల పెరుగుదల నమోదైంది. ఒక టిఎంసీ నీటితో సుమారు 10,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అంచనా ఈ లెక్కన లక్ష ఎకరాలకు పైగా సాగుకు నీరు అందే అవకాశం ఏర్పడిందన్నారు. అలాగే భూగర్భ జలాల పరంగా కూడా జిల్లాలో సుమారు 35 టిఎంసీల మేర నీటి నిల్వ పెరిగినట్లు వెల్లడించారు. ఎటువంటి కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించకుండా కేవలం ఫీడర్ ఛానల్స్ శుభ్రపరిచడం ద్వారా ఈ స్థాయి ఫలితాలు సాధించగలిగామని జిల్లా కలెక్టర్ అన్నారు. సాటిలైట్ చిత్రాల ఆధారంగా పరిశీలించినప్పుడు గత సంవత్సరం ఫిబ్రవరి చివరి నాటితో పోలిస్తే ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరికి జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు వంటి నీటి వనరుల విస్తీర్ణం సుమారు 11,341 ఎకరాలు పెరిగినట్లు తెలిపారు. ఇదే సమయంలో రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నదాత సుఖీభవ పథకం కింద మూడో విడతగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలను కలిపి మొత్తం 1 లక్ష 88 వేల మంది రైతులకు సుమారు రూ.108 కోట్ల ఆర్థిక సహాయం విడుదల చేయబడుతోంది. ఇందులో ఈ నియోజకవర్గానికి మాత్రమే రూ.22 కోట్ల రూపాయలు విడుదల అవుతున్నాయి. ఇప్పటివరకు మొదటి, రెండో, మూడో విడతలను కలిపి ఈ నియోజకవర్గంలోనే సుమారు రూ.75 కోట్ల సహాయం అందించడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా మొత్తం రూ.254 కోట్ల రూపాయలు రైతులకు అందించబడినట్లు తెలిపారు. రైతుల ఆర్థిక భారం తగ్గించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని అధికారులు పేర్కొన్నారు. పాత అన్నమయ్య జిల్లా ప్రాతిపదికన నియోజకవర్గాల వారీగా అన్నదాత సుఖీభవ - పి.ఎం.కిసాన్ మూడవ విడత వివరాలు రాయచోటి నియోజకవర్గం లో 39,031 మంది రైతులకు అన్నదాత సుఖీభవ లబ్ది మొత్తం రూ.15.61 కోట్లు, పి.ఎం.కిసాన్ లబ్ది మొత్తం రూ.6.66 కోట్లు, మొత్తం రూ.22.27 కోట్లు. పీలేరు నియోజకవర్గం లోని 38,490 మంది రైతులకు అన్నదాత సుఖీభవ లబ్ది మొత్తం రూ.15.40 కోట్లు, పి.ఎం.కిసాన్ లబ్ది మొత్తం రూ.6.75 కోట్లు, మొత్తంగా రూ.22.15 కోట్లు మదనపల్లి నియోజకవర్గం లోని 20,162 మంది రైతులకు అన్నదాత సుఖీభవ లబ్ది మొత్తం రూ. 8.06 కోట్లు, పి.ఎం.కిసాన్ లబ్ది మొత్తం రూ.3.66 కోట్లు, మొత్తంగా రూ.11.72 కోట్లు తంబళ్లపల్లి నియోజకవర్గం లోని 44,867 మంది రైతులకు అన్నదాత సుఖీభవ లబ్ది మొత్తం రూ.17.95 కోట్లు, పి.ఎం.కిసాన్ లబ్ది మొత్తం రూ.7.83 కోట్లు, మొత్తంగా రూ.25.78 కోట్లు రాజంపేట నియోజకవర్గం లోని 21,236 మంది రైతులకు అన్నదాత సుఖీభవ లబ్ది మొత్తం రూ.8.49 కోట్లు, పి.ఎం.కిసాన్ లబ్ది మొత్తం రూ.3.82 కోట్లు, మొత్తంగా రూ.12.31కోట్లు కోడూరు నియోజకవర్గం లోని 24,622 మంది రైతులకు అన్నదాత సుఖీభవ లబ్ది మొత్తం రూ.9.85 కోట్లు, పి.ఎం.కిసాన్ లబ్ది మొత్తం రూ.4.35 కోట్లు, మొత్తంగా రూ.14.20 కోట్లు ఇందులో మొత్తం 1,88,408 మంది రైతులకు దాదాపుగా రూ. 108కోట్లు జమ చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం రాయచోటి నియోజకవర్గం లోని 39.031 మంది రైతులకు 22.27 లక్షల మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. రైతు సాధికార సంస్థ అన్నమయ్య జిల్లా వారి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనల ను సందర్శించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం క్రింద తేది. 16.3.2026 నుండి 29.04.2026 గాలుకుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పోస్టర్ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు

ఈ కార్యక్రమానికి రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్,టిడిపి నాయకులు మండిపల్లి లక్ష్మి ప్రసాద్ రెడ్డి, మార్కెటింగ్ యాప్ చైర్మన్ రామచంద ప్రసాద్, పశుసంవర్ధక శాఖ అధికారి, రైతులు, తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :