Sunday, 13 September 2026 03:56:34 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

వైసిపి ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్న ఇళ్లను చూపిస్తూ “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ ప్రచారం చేసుకున్న ‘క్రెడిట్‌ చోరుడు’ సిఎం చంద్రబాబునాయుడు అని మ

Date : 17 November 2025 06:41 PM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వైసిపి ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్న ఇళ్లను చూపిస్తూ “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ ప్రచారం చేసుకున్న ‘క్రెడిట్‌ చోరుడు’ సిఎం చంద్రబాబునాయుడు అని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ పేర్కొన్నారు.‌ మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలంలోని నడిమిపల్లి, చెంబకురు, కాప్పాల్లి, ఏలగపల్లి, కమ్మవారిపల్లి, నారిగానిపల్లి కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించలేదని, ఒక్క సెంటు స్థలం కూడా ఎవరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఇళ్ళ నిర్మాణానికి ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదని, ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్న ఇళ్లను చూపిస్తూ “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ ప్రచారం చేసుకున్న ‘క్రెడిట్‌ చోరుడు’ సిఎం చంద్రబాబునాయుడు అని పేర్కొన్నారు. తాము ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వలేదని, ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించ లేదన్నారు. ఆ 3,00,092 ఇళ్లలో వైసిపి హయాంలోనే సుమారు 1 లక్ష 50 పూర్తయ్యే దశలో ఉన్నవేనని పేర్కొన్నారు. మరో 87 వేలకు పైబడి ఇళ్లు శ్లాబ్‌ లెవల్‌ వరకూ గత ప్రభుత్వ హాయాంలోనే కట్టించినవేనని తెలిపారు. ఇవికాక అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకేరోజు గృహప్రవేశాలతో గత ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని, ఇన్ని వాస్తవాలు కళ్ళముందే ఉన్నా అసలు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, అన్నీ కూటమి ప్రభుత్వమే చేసినట్టుగా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబు క్రెడిట్‌ చోరుడు అన్నారు. మదనపల్లె కేంద్రంగా జరిగిన కిడ్ని రాకెట్ పైన సిట్, సిఐడి విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున కిడ్ని రాకెట్ పట్టుబడి, దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తే చర్యలు మాత్రం శూన్యం అన్నారు. మెడికల్ కాలేజీల పిపిపి విధానాన్ని వెంటానే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె నియోజకవర్గ వైసిపి పరిశీలకులు అనూషారెడ్డి, కేశవరెడ్డి, రమణారెడ్డి, CH. రామచంద్రారెడ్డి, గెవెన్న, దర్శన్ గౌడ్, V.S.రెడ్డి, ఇర్ఫాన్ షేక్, కృష్ణారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, రెడ్డి వీరై గౌడ్, తిప్ప రాజు, చంద్ర, జింకల శ్రీనివాసులు, గంగాధర, చరణ్, నర్సింహా రెడ్డి, రాధాకృష్ణ రెడ్డి, నాగప్ప, మహేష్, నాగమణి, పద్మారెడ్డి, ఫయాజ్ ఖాన్, చలపతి, జబివుల్లా తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :