Monday, 14 September 2026 07:47:54 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

రామసముద్రం నుండీ వెయ్యి మంది భక్తులు తిరుమల పాదయాత్ర

16సంవత్సరాలుగా కొనసాగుతున్న అనవయితీ

Date : 29 December 2025 12:09 PM Views : 277

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 29 : రామసముద్రం మండల కేంద్రంలోని శ్రీవారి భక్తులు దాదాపు 900 మంది భక్తులు గందోడి పూల అంజప్ప ఆధ్వర్యంలో సోమవారం ఉదయం శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి ఆలయం నందు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చెక్ పోస్టు కూడలి లోని గ్రామ దేవత గంగమ్మకు పూజలు నిర్వహించి అనంతరం ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండటం ఆనందంగా ఉందని తెలిపారు. పాదయాత్ర గా వెళ్లే భక్తులకి మూడు పూటలా భోజన సౌకర్యం ఏర్పాటు చేసుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ పాదయాత్ర ని చేపట్టుతున్నారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు టీటీడీ లక్కీ డ్రిప్పు ఆన్లైన్ ద్వారా టికెట్లను ఈ సంవత్సరం భక్తులకు జారీ చేసింది. వీరికి ఎవరికీ టికెట్లు లేకపోవడంతో 2వ తేదీ నుంచి సామాన్య భక్తుల సర్వదర్శనం కోసం శ్రీవారి భక్తులు బయలుదేరారు. భక్తి పాటలతో కోలాటం చెక్కభజనలుతో ఆడతూ పాడుతూ పాదయాత్ర ఎలాంటి అలుపు సోలుపు లేకుండా భక్తి భావంతో వెళ్తున్నారు. రామసముద్రం లో గోవింద నామస్మరణలతో మారమోగింది. ఈ కార్యక్రమంలో గందోడి పూల అంజప్ప, శ్యామప్ప, వెంకటేష్, జనార్ధన్, కుమార్, ఆనంద, నారి, వెంకటరమణ,విజయ్ కుమార్, డ్రైవర్ సీనప్ప, శ్రీవారి భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :