నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 08 : రాష్ట్ర మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ తెలిపారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ఐకెపి ఏపిఎం గంగాధర్, సిడిపిఓ సుజాత ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర పాల ఏకిరి సంఘం అధ్యక్షుడు నాగేశ్వర నాయుడు మాట్లాడుతూ మహిళాభివృద్ధి కోసం మూడు దశాబ్దాల క్రితమే నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా పొదుపు సంఘాలతో వారిలో చైతన్యం తెచ్చి నేడు సంఘాల బలోపేతమై లక్షాధికారులు కావడానికి దోహద పడినట్లు చెప్పారు. టిడిపి ప్రభుత్వంలోని మహిళలకు దీపం పథకంలో మూడు సిలిండర్లు ఉచితం, డ్వాక్రా సంఘాల ద్వారా బ్యాంకు రుణాలు,శ్రీ శక్తి పథకంలో బసుల్లో ఉచిత ప్రయాణం తో పాటు ప్రతి పథకాన్ని మహిళల కేటాయించి వారి ఆదరణ పొందినట్లు చెప్పారు. జిల్లా బీసీ సంఘం ఉపాధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ టిడిపి ఆవిర్భావం నుండి మహిళా సంక్షేమ ధ్యేయంగా టిడిపి నిలవడానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషే కారణమన్నారు. టిడిపి మహిళా నాయకురాలు సిద్ధమ్మ మాట్లాడుతూ మహిళలు సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో మహిళలు లక్షాధికారులుగా మారారని కొనియాడారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి మహిళలకు పంచిపెట్టారు. అనంతరం అంగన్వాడీలు ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్ సందర్శించి వారిని అభినందించారు.తొలుత నాగేశ్వర నాయుడు, పర్వీన్ తాజ్ లను స్థానిక టిడిపి నాయకులు ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఐకెపి మండల సమాఖ్య అధ్యక్షురాలు రామలక్ష్మమ్మ, మహిళా సిసి ఆదిలక్ష్మి, వివో సభ్యులు, ఆరు మండలాల అంగన్వాడీ సూపర్వైజర్లు, మహిళా సంఘ సభ్యులు, టిడిపి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News