నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 06 : నేడు కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలిపిన కేంద్రీయ విద్యాలయాల అనుమతి లో అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లె కు అనుమతి మంజూరు కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్న వైసీపీ శ్రేణులు . రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన కృషి ఫలించింది. మదనపల్లెలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం కేంద్రంలో చేసిన అనేక ప్రయత్నాలు ఇప్పుడు కార్యరూపం దాల్చనున్నాయి. కేంద్రం తాజాగా విడుదల చేసిన నూతన కేంద్రీయ విద్యాలయాల జాబితాలో మదనపల్లి కూడా మెరిసింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ కూడా ఇందుకు ఆమోదముద్ర వేసింది. రానున్న విద్య సంవత్సరం కు అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మన ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నందుకు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ కృషి వల్లే ఇది సాధ్యమైందని నగర వాసులు సంబర పడుతున్నారు..
Admin
Namitha News