నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ స్థలంలో నిర్వహించే వారపు సంత నందు నేను నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన గోడౌన్లను, షెడ్లపై చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన bys ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది, అనంతరం బహుజన్ యువసేన బి వై ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ ప్రభుత్వం వారు వారి ప్రాంతాలలో, చుట్టుపక్క గ్రామీణ రైతులు వారు సాగు చేసిన పంటలను, కూరగాయలను, వివిధ ఆహార వస్తువులను, రైతులకు సంబంధించిన పనిముట్లను అమ్ముకుని రైతుకు ఉపయోగపడే వ్యాపార కేంద్రాలుగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం వారు ప్రభుత్వ స్థలాలను కేటాయించి, రైతులకు ఎక్కువ భారం కాకుండా కేవలం గేటు మాత్రమే వసూలు చేయిస్తూ వారపు సంతలను నిర్వహించడం జరుగుతుందని, మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో, మున్సిపాలిటీ స్థలంలో నిర్వహిస్తున్న వారపు సంతలో, ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా దళారులు వ్యాపారస్తులు వ్యాపారాలను నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారం మరియు మునిసిపల్ యాక్ట్ ప్రకారం, వారపు సంత స్థలంలో ఎలాంటి పర్మినెంట్ నిర్మాణాలు గానీ, గోదాములు గాని నిర్మించరాదని నియమ నిబంధన కలిగి ఉందని, కానీ మదనపల్లి వారపు సంత స్థలంలో కొంతమంది వ్యాపారస్తులు మరియు దళారులు సొంతంగా పెద్ద పెద్ద షెడ్లను, పెద్ద పెద్ద గోదానులను నిర్మించడమే కాకుండా, వాటికి విద్యుత్ మీటర్ కనెక్షన్లు కూడా అక్రమంగా తీసుకుని వ్యాపారాలు నిర్వహించడమే కాకుండా, కొంతమంది అయితే ఆ షెడ్లను బాడుగులకు ఇచ్చి సొమ్ము చేసుకుంటూ మునిసిపల్ ఆదాయాన్ని దోచుకోవడమే కాకుండా చుట్టుపక్క రైతులకు అన్యాయం చేస్తున్నారని, కేవలం స్వల్ప మున్సిపల్ గేటును చెల్లించి, మునిసిపల్ స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు బాడుగలను వసూలు చేయడం చాలా బాధాకరమని పునీత్ అన్నారు, అలాగే చుట్టుపక్క రైతులు వచ్చి వారు పండించిన పంటను వారి గిట్టుబాటు ధరకు అమ్ముకోవడానికి వీలు లేకుండా కొంతమంది మాత్రమే సంత స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టుకొని, వారు మాత్రమే వ్యాపారాలు చేసుకుంటూ రైతులకు తీవ్ర నష్టం కలగ చేస్తున్నారని, వీటిపై గతంలో ఉన్న సబ్ కలెక్టర్ గారు చర్యలు తీసుకొని, వెంటనే చేపట్టిన నిర్మాణాలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన, వ్యాపారస్తులు దళారులు వారికి ఉన్న డబ్బు బలంతో అధికార బలంతో ఏమాత్రం పట్టించుకోవడంలేదని, అయినా మున్సిపల్ స్థలాల్లో షెడ్లను నిర్మించి మున్సిపల్ స్థలాల్లో ప్రవేట్ వ్యక్తులు బాడుగలను వసూలు చేయడం ఏంటని పునీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని, ఏ అధికారి అవినీతికి పాల్పడి దళారులు వ్యాపారులపై చర్యలు తీసుకోవడం లేదని పునీత్ త్ ఆవేదన వ్యక్తం చేశారు, కావున ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సంత స్థలాన్ని సందర్శించి, అక్కడ అక్రమంగా నిర్మించిన షెడ్లు గోడౌన్లుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని, అంతకి అక్కడ నిర్మించి వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు, వ్యాపారాలు చేసుకోవాలంటే పక్కనే కోట్ల రూపాయలతో నిర్మించి నిరుపయోగంగా ఉన్న రైతు రైతు బజారు లో ఉన్న రూములను అధికారికంగా తీసుకొని వ్యాపారం చేసుకోవచ్చని పునీత్ అన్నారు, వారపు సంతలో ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే చుట్టుపక్కల గ్రామీణ రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకొని, మున్సిపల్ ఆదాయానికి గండి పడకుండా, అలాగే నియమ నిబంధనలకు విరుద్ధంగా సొంత స్థలంలో నిర్మాణాలు చేపట్టి రైతులకు తీవ్ర నష్టం కలక్కుండా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఏ అధికారులు అయితే షెడ్యూల్ నిర్మించుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారో, ఏ అధికారులు అయితే చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారో వారిపై లోకాయుక్త కి వెళ్లి చర్యలు తీసుకునేలాగా పోరాటం చేస్తామని పునీత్ అన్నారు, ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు శ్రీనివాసులు, హరికృష్ణ, జిలాని, శ్రీనివాసులు, శశి కుమార్, వినయ్, నితీష్, బ్రహ్మ, నిజాం భాష, బాలకృష్ణ, శశి, గౌతమ్, రాజేష్, దేవేష్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News