Saturday, 12 September 2026 09:00:51 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

కోడలి దాస్టికం రోడ్డు మీద అత్త మృతదేహం - కొడుకు, మనుమరాలు రోడ్డుపైనే మృతదేహం తో నిరీక్షణ

ఆమె నిర్మించుకొన్న సొంత ఇంటిలోకే ఆమె మృతదేహన్ని రానివ్వని కోడలి వైనం - రోడ్డు మీదే మృతదేహం తో కొడుకు ఆవేదనతో నిరీక్షణ

Date : 06 November 2025 01:10 PM Views : 359

నమిత న్యూస్ - Andhra Pradesh / శ్రీ బాలాజీ ( తిరుపతి ) : శ్రీకాళహస్తి - నవంబర్ 06 : రోజు రోజుకు మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి అనడానికి ఉదాహరణగా గురువారం శ్రీకాళహస్తి లో ఓ ఘటన పలువురి హృదయాలను కలసివేసింది. 39 సంవత్సరాల పాటు అనేక మందికి విద్యాబోధన చేసిన ఓ మహిళా ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి 77సంవత్సరాలు , వృద్ధాప్యం అనారోగ్యం తో నేడు మృతి చెందింది. అయితే ఆమె మృతదేహాన్ని కష్టపడి ఆమె కట్టుకున్న సొంత ఇంట్లో నుండి సాగనం పాలనే కోరికను తీర్చలేని పరిస్థితి అక్కడ నెలకొంది. చనిపోయిందని ఆమె మృతదేహాన్ని తీసుకుని ఇంటి దగ్గరకు వస్తే మృతదేహాన్ని లోపలికి రానీకుండా నిర్ధాక్షణంగా తలుపులు మూసి మృతదేహాన్ని రోడ్డు మీదే ఉంచేసింది కోడలు. అత్యంత రద్దీ గల పెళ్లి మండపం నుండి వైఎస్ఆర్ విగ్రహానికి వెళ్లే మధ్య మార్గంలో రిలయన్స్ మార్ట్ ఎదురుగా రోడ్డు మీదే మృతదేహాన్ని పెట్టి కొడుకు మనవరాలు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరీక్షణ చేస్తున్నారు. కొడుకు సురేష్ భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదం తో కోడలి సూటిపోటి మాటలు భరించలేక సురేష్ , తల్లిని తీసుకొని మనవరాలను చదివించుకుంటూ పుత్తూరులో ఉంటున్నారు. అయితే రమాదేవి తర్వాత మృతి చెందింది. ఈ నేపథ్యంలో సొంత ఇంట్లో ఉంచి తన పార్దీవ దేహాన్ని అంతిమయాత్ర నిర్వహించాలని ఆమె చివరి కోరిక తీర్చడానికి కొడుకు తన సొంత ఇంటికి తీసుకుని వచ్చాడు . కానీ ఆ కోడలు ఆమె మృతదేహాన్ని లోపలికి రానీకుండా తలుపులు బిగించి లోపల కూర్చున్నది. వారికి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొడుకు సురేష్, మనవరాలు రేష్మ రోడ్డు మీద రోదిస్తున్నారు. తన తల్లి సొంత ఇంటిలోకే ఆమె మృతదేహాన్ని తీసుకోలేకపోతున్నామని కొడుకు మనవరాలు పడుతున్న ఆవేద జనాలని కలచివేస్తుంది. దీనిపైన అధికారులు వెంటనే స్పందించి ఆమె మృతదేహాన్ని సొంత ఇంట్లో ఉంచి అ అంతిమ యాత్ర చేసే ఏర్పాటు చేయాలని . కొడుకు సురేష్ కోరుతున్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :