Monday, 14 September 2026 10:51:06 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

1960 లో మున్సిపల్ గెజిట్ లో ఉన్న రోడ్డు ను వెలికి తియ్యాలి - సిపిఎం నిరసన

హడావిడి రోడ్డు ఆక్రమణలు తొలగించడం ఎవరి మెప్పుకోసం

Date : 06 February 2026 08:15 PM Views : 197

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 06 : మదనపల్లె పట్టణంలో రోడ్డు ఆక్రమణలు హడావిడిగా తొలగించి ఎవరి మెప్పు పొందాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగ ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఇప్పటికే విపరీతమైన వాహన రద్దీ, ప్రజల రాకపోకలతో తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలు పడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి రోడ్లు వెడల్పు చేసి, ట్రాఫిక్ సిగ్నల్లు రోడ్డు డివైడర్లు ఏర్పాటు చెయ్యడం ద్వారా సమస్యలు పరిష్కరించాలని అన్నారు. మున్సిపల్, పోలీస్ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించకుండా, రోడ్డు ఆక్రమణలు ఎంత అయ్యాయో తేల్చకుండా హడావిడిగా జేసిబి తో రోడ్డు ఆక్రమణలు తొలగించు పేరుతో ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు చేపట్టిన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు వలన విద్యార్థులు, రైతులు, కూలీలు, ఉద్యోగం, ఉపాధ్యాయులు, ఆసుపత్రులకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ఉన్న రోడ్లు అన్నీ ఆక్రమణలు పాల్పడ్డారని, రోడ్డు ఆక్రమించుకోవడమే కాకుండా, వాళ్ళ బిల్డింగ్‌ల ముందు చిన్న తోపుడు బండ్లు, బంకులు పెట్టించి, వారి వద్ద వేల రూపాయలు బాడుగలు (అద్దెలు) వసూలు చేసుకునే వారికి మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా అధికారుల వైఖరి ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి రోడ్డు ఆక్రమణలు తొలగింపు పేరుతో హడావిడి తప్ప మరొకటి కాదని అన్నారు. పట్టణంలోని ప్రజలు, వాహనదారులు అందరికీ ట్రాఫిక్ అవగాహన కల్పించాలని కోరారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సిపిఎం ఉద్యమం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, నరసింహ, అనిల్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: