Sunday, 13 September 2026 05:59:41 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రేపు ఉదయం 9 గంటలకు ఒక బిగ్ న్యూస్ వింటారు: మంత్రి నారా లోకేశ్

2019లో ప్రాజెక్టులు నిలిపేసిన ఓ కంపెనీ ఏపీకి తిరిగొస్తోందన్న మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' వేదికగా వెల్లడి ఆ సంస్థ తుపానులా ఆ సంస్థ రాష్ట్రంలోకి అడుగుపెట

Date : 12 November 2025 09:29 PM Views : 214

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 12: #InvestInAP హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయడంతో పెరిగిన ఆసక్తి ఆ కంపెనీ ఏదనే దానిపై సర్వత్రా ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకెళుతున్న కూటమి ప్రభుత్వం, మరో కీలక ప్రకటనకు సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ 'ఎక్స్' వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఐదేళ్ల క్రితం రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఓ ప్రముఖ కంపెనీ తిరిగి రాబోతోందని ఆయన ప్రకటించారు. "2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక కంపెనీ, రేపు తుపానులా ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వస్తోంది. పూర్తి వివరాల కోసం ఉదయం 9 గంటలకు వేచి ఉండండి!!" అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. 'బిగ్ అన్ వీల్' అంటూ చేసిన ఈ పోస్టుకు #InvestInAP, #ChooseSpeedChooseAP అనే హ్యాష్‌ట్యాగ్‌లను జతచేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తూ, పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీని తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ హ్యాష్‌ట్యాగ్‌లు ప్రతిబింబిస్తున్నాయి. కాగా, 2019లో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పలు కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేయడం లేదా ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లడం జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆగిపోయిన ప్రాజెక్టులను పునఃప్రారంభించడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో, లోకేశ్ ప్రకటించిన ఆ సంస్థ ఏది? ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టబోతోంది? అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే రేపు (గురువారం) ఉదయం 9 గంటల వరకు వేచి చూడాల్సిందే.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: