Thursday, 30 July 2026 06:47:58 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం - ఎమ్మెల్యే షాజహాన్ బాషా

Date : 25 November 2025 08:12 PM Views : 230

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 25 : రామసముద్రం మండలం కే సి పల్లి పంచాయతీలో నూతనంగా నిర్మించిన పవర్‌స్టేషన్‌ను ఎమ్మెల్యే షాజహాన్ భాషా మంగళవారం ప్రారంభించారు. కేసీ పల్లె పర్యటన విచ్చేన ఎమ్మెల్యే షాజహాన్ బాషా కు మండల టిడిపి నాయకులు శాలువలు పూలహారాలతో ఘనంగా స్వాగతం పలికారు మహిళలు హారతులు పట్టారు.కేసీ పల్లె కె వి ఏ విద్యుత్ సబ్ స్టేషన్ లో రెండు ఎం వి ఏ అదనపు ట్రాన్స్ఫర్మర్స్ ఎల్. వి బ్రేకర్స్ ను పూజలు చేసి మండల టిడిపి నాయకులు తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలం లోని రైతులు,వినియోగ దారులకు నిరంతర మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్మమన్నారు. పల్లెల్లో ఎదురయ్యే లో-వోల్టేజ్ సమస్యలు, ఫీడర్‌ లోడ్లు, ట్రాన్స్‌ఫార్మర్ ఒత్తిడి వంటి సమస్యలను తగ్గించేందుకు ఈ పవర్‌స్టేషన్ ఎంతగానో ఉపయుక్తమవుతుం దన్నారు. విద్యుత్ సిబ్బంది విద్యుత్ సేవలాందించడంలో ముందుండాలన్నారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. నేను 99 నుండి 2004వరకు ఎమ్మెల్యే గా ఉన్నానని అప్పుడు నేను ప్రారంభించిన సబ్ స్టేషన్ లు ఉన్నాయని నాతరువాత మదనపల్లి నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యే లు వచ్చారని వారు ఏమి అభివృద్ధి చేశారన్నారు. నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు వేసిన రోడ్లు కనపడుతున్నాయి. వారువేసిన రోడ్లు కనపడటలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి చేశారని చెప్పాలన్నారు. నేను ఎమ్మెల్యే గా అవ్వగానే కేసీ పల్లె ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలకు అధిక క్లాస్ రూంలు కావాలని అడగగా వెంటనే ఆరు గదులు మంజూరు చేశానని,వైసీపీ ఎంపి, ఎమ్మెల్యే లు ఏమి అభివృద్ధి చేశారన్నారు.మండలానికి ఈరోజే ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా 1కోటి 42లక్ష్మలు మంజూరు అయ్యాయని త్వరలో మీ ఇంటి కి వచ్చి పంపిణీ చేస్తానన్నారు.చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి అవ్వగానే అక్క, చెల్లమ్మలకు సంవత్సరానికి మూడు సిలిండర్ లు అందజేస్తున్నారని. మహిళలకు ఫ్రీ బస్, బ్యాంకు లో డ్వాక్రా రుణాలు మంజూరు చేస్తున్నారని మంచి చేస్తున్నా ప్రభుత్వాన్ని ఆదరించండన్నారు. మండలంలోని ఇల్లు లేనివారు సచివాలయంకు వెళ్లి అప్లై చేసుకోండి.తాహిసీల్దార్ మహ్మద్ అజారుధీన్ తో మాట్లాడుతూ ఇంటి స్థలాలు లేని వారికి ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉన్నదో అక్కడ స్థలం చూపించాలన్నారు. నూతనంగా కాలనీ కట్టి చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఎమ్మెల్యే షాజహాన్ బాషా,తాహిసీల్దార్ మహ్మద్ అజారుదీన్,ఈ ఈ గంగాధరం, డి. ఈ ఈ హరికుమార్,ఎంపిడిఓ లతీఫ్ ఖాన్,ఏఈ మస్తాన్ వల్లి,రాజగోపాల్ రెడ్డి,ఏ పీ ఎం సాంబ శివ,విద్యుత్ సిబ్బంది మండల టిడిపి నాయకులు పెద్ధిరెడ్డి, గుండ్ల పల్లె శివారెడ్డి,కృష్ణంరాజు, రూపేష్ రెడ్డి,లోక రాజు,సుధాకర్ రెడ్డి,డాక్టర్ శివకుమార్ రెడ్డి, లోకేష్ రెడ్డి,అనిల్ కుమార్,మహేష్ రెడ్డి, ఒంటెల అల్తాఫ్ బాషా, మంత్రి శంకర, శంకర్ రెడ్డి మాలమహానాడు అధ్యక్షులు కృష్ణప్ప,శ్రీనివాసులు,వెంకటరమణ, పెద్ద కృష్ణప్ప సంఘమిత్రాలు తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :