Sunday, 13 September 2026 07:11:23 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు - గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి

పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలు

Date : 18 November 2025 08:56 PM Views : 200

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు - గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి వెల్లడి - పలు పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలు మదనపల్లె : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి పేర్కొన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం గ్రంథాలయాల ప్రాముఖ్యత అనే అంశంపై వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలను బాపూజీ మున్సిపల్ హైస్కూల్,బూన్ హైస్కూల్,జిల్లా పరిషత్ స్కూల్,జి.ఆర్.టి ఇంగ్లీష్ మీడియం స్కూల్,జ్ఞానోదయ స్కూల్ విద్యార్థులకు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంత కుమారి మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయన్నారు.ప్రతిరోజు వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.అదేవిధంగా వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు నేడు అనగా బుధవారం జరుగబోవు మహిళా దినోత్సవం కార్యక్రమంలో బూన్ స్కూల్,బాపూజీ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయబడునన్నారు.మిగిలిన పాఠశాలల పిల్లలకు వారోత్సవాల ముగింపు రోజైన ఈనెల 20వ తేదీన బహుమతులు ప్రదానం చేయబడునన్నారు.ఈ కార్యక్రమంలో బూన్ హైస్కూల్ కరస్పాండెంట్ శంకర్,హెచ్.ఎం రమాదేవి,ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,విద్యార్తినీ,విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :