Saturday, 12 September 2026 12:08:19 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు

Date : 11 September 2026 04:21 PM Views : 11

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు మదనపల్లె : రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ప్రజా శ్రేయస్సుకై పరితపించే నాయకుడని వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా పేర్కొన్నారు.శుక్రవారం ఎంపీ మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మదనపల్లె పట్టణం,14వ వార్డులో ఇరిగేషన్ కార్పొరేషన్ మాజీ స్టేట్ డైరెక్టర్ దండాల రవిచంద్రా రెడ్డి,పార్టీ శ్రేణులు సమక్షంలో అట్టహాసంగా జరిగాయి.ఇందులో భాగంగా ఎస్.ఏ కరీముల్లా సమక్షంలో కేక్ కట్ చేసి అభిమాన నాయకుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం తిరుపతిలోని ఎంపీ నివాసానికి వెళ్లి ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎస్.ఏ కరీముల్లా మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారంలో పెద్దిరెడ్డి కుటుంబం ఎల్లవేళలా ముందుంటుందన్నారు.తన తండ్రి,మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నుండి రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకొన్న మిథున్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించారని,అనతి కాలంలోనే ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారన్నారు.మూడు పర్యాయాలు ఎంపీగా ఎన్నికై ప్రజాసేవకు పునరంకితమయ్యారని,రాజంపేట పార్లమెంట్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్నారని కొనియాడారు.మదనపల్లె మెడికల్ కళాశాల,పీలేరు - మదనపల్లె నాలుగు వరుసల రహదారి నిర్మాణం,కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటులో ఆయన పాత్ర క్రియాశీలకమన్నారు.మాజీ సీఎం,వైకాపా అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాలలో సహాయ,సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి ప్రత్యేక చొరవ చూపుతున్నారని ప్రశంసించారు.వైకాపా కార్యకర్తల శ్రేయస్సు,పార్టీ అభ్యున్నతికి నిర్విరామ కృషిచేస్తున్న ఎంపీ మిథున్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు షేక్ షబానా,ముబీనా,అస్మత్ జాన్,గట్టు సురేష్,సురేంద్ర నాథ్,కిశోర్ కుమార్ రెడ్డి,నాగిరెడ్డి,రఫీ,తాజ్ బాషా,రమాదేవి,పెద్దఎత్తున వైసిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :