నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి - జనవరి 12 : నిమ్మనపల్లి మండలం అధ్యక్షులు కొమ్మేపల్లి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో వై.యస్.ఆర్ సి.పి. కార్యకర్తలు, స్థానిక నేతలతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ , పుంగనూరు మదనపల్లి నియోజకవర్గం పార్లమెంట్ పరిశీలకురాలు అనీషా రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలు, స్థానిక నేతలకు పార్టీ భాలోపేతం దిశగా కృషి చేసే దిశగా గ్రామ, వార్డు స్థాయి కమిటీల నిర్మాణం, సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లాస్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయి, వార్డుస్థాయి కమిటీలలో నిర్మాణ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో పలు అంశాల పై చర్చించి, పార్టీ మరింతగా బలోపేతం కావడానికి అనుసరించాల్సిన విధివిదానలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లె సింగల్ విండో మాజీ అధ్యక్షుడు రెడ్డి శేఖర్ రెడ్డి , రమణారెడ్డి , ఎంపీపీ నరసింహులు వైస్ ఎంపీపీ జయప్రకాశ్ రెడ్డి , శ్రీనివాసులు, ఆర్. శ్రీనివాసులు , నవీన్, రాజన్న, ఎర్రయ్య, రెడ్డి భాస్కర, ఖాదర్ బాషా, దావూద్, యోగానంద రెడ్డి, హేమంత్, అగ్రహారం సర్పంచ్ ఉషా రాణి, కొండయ్య గారి పల్లి సర్పంచ్ శశి రెడ్డి, హోటల్ రఫీ, తవళం పంచాయతీ తుపాకుల ఆది, గంగాధర్, శంకర, రవి, చందు, కొర్లకుంట దామోదర, రవితేజ, మరియు నిమ్మనపల్లి మండలం లో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు సర్పంచులు మాజీ సర్పంచులు జడ్పిటిసిలు ఎంపీటీసీలు అనుబంధ విభాగాల నాయకులు కమిటీ మండల సభ్యులు కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News