Saturday, 12 September 2026 08:59:45 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

తంబళ్లపల్లె లో పారిశ్రామిక వాడ స్థానిక ప్రజలకు ఓ వరం - తహసిల్దార్ శ్రీనివాసులు

Date : 11 November 2025 11:36 PM Views : 341

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 11 ః దశాబ్దాలుగా పూర్తిగా వెనుకబడిన తంబళ్లపల్లె నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వాడ ఏర్పాటు తో స్థానిక ప్రజలకు ఓ వరం లా నిలుస్తుందని తంబళ్లపల్లె తాశీల్దార్ శ్రీనివాసులు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని కుక్కరాజుపల్లి సచివాలయ ప్రాంగణంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎం ఎస్ ఎం ఈ ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమం జన సందోహం మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్చువల్ గా రూ 7.70 కోట్ల తో ఏర్పాటు చేస్తున్న ఎం ఎస్ ఎం ఈ పార్క్ శంకుస్థాపన శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఏపీఐఐసీ ఐపిఓ శంకర్ మాట్లాడుతూ పారిశ్రామిక వాడ ఏర్పాటుకు కేటాయించిన 20.981 ఎకరాల ప్రభుత్వ భూముల్లో భూమి చదును చేయడంతో పాటు రోడ్లు, కాలువలు, నిరంతర విద్యుత్తు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ నాగార్జున మాట్లాడుతూ ఈ పారిశ్రామిక వాడ ఏర్పాటుతో పూర్తిగా వెనుకబడిన తంబళ్లపల్లి నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలతో పాటు భవిష్యత్తులో పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ పారిశ్రామిక వాడ ఏర్పాటు స్థానిక ప్రజలకు ఆయువుపట్టుగా నిలిచి పరిశ్రమలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తద్వారా మహిళా సంఘాలు చిన్న పరిశ్రమలు ఏర్పాటు తో జీవనోపాధి, స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి తోనప్ప మాట్లాడుతూ తంబళ్లపల్లె లో ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని భవిష్యత్తులో ఈ పారిశ్రామిక వాడ స్థానిక ప్రజలకు మరింత చేరువలో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు దోహదపడుతుందన్నారు. టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, తెలుగు యువత ఉపాధ్యక్షుడు నరసింహులు, మదన్ మోహన్, శేఖర్ రెడ్డి, ఆదిరెడ్డి లు మాట్లాడుతూ నాటి వైకాపా ప్రభుత్వం భూములు దోచుకుని రైతులు, ప్రజలను మోసం చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు, యువత, మహిళ, కార్మిక వర్గాల అభివృద్ధి కోసం హంద్రీనీవా జలాలు, పారిశ్రామిక వాడ తోబాటు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ఆయనకే దక్కినట్లు చెప్పారు. తంబళ్లపల్లె అభివృద్ధికి సహకరించడం హర్షనీయమని ఇది కూటమి ప్రభుత్వ విజయమని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఐకెపి ఎపిఎం గంగాధర్, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్, వీఆర్వోలు నాగరాజు, సంజీవ్ కుమార్, సంఘమిత్ర సోమశేఖర్, పలు శాఖల అధికారులు, మహిళా సంఘాలు, కూటమి నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: