Saturday, 12 September 2026 01:52:36 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

బహుజన యువసేన ఫిర్యాదుపై స్పందించిన ఆహార భద్రత శాఖ - మదనపల్లెలో హోటళ్లు,రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు

Date : 03 August 2026 06:02 PM Views : 134

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బహుజన యువసేన ఫిర్యాదుపై స్పందించిన ఆహార భద్రత శాఖ - మదనపల్లెలో హోటళ్లు,రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు పట్టణంలోని హోటళ్లు,రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపాలు,వంట నూనెను పదేపదే వినియోగించడం,ప్రిజర్వేటివ్‌లతో కూడిన ఆహార పదార్థాలను ఉపయోగించడం ద్వారా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ పది రోజుల క్రితం జిల్లా ఆహార భద్రతాధికారిణి హరితకి ఫిర్యాదు చేశారు.ఆ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఆహార భద్రతాధికారి హరిత సోమవారం పునీత్ కుమార్ సమక్షంలో మదనపల్లెలోని పలు హోటళ్లు,రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తనిఖీల్లో అనేక హోటళ్లలో వంట నూనెను పదేపదే వినియోగించడం,ప్రిజర్వేటివ్‌ల వాడకం,పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం,వంటశాలలు అపరిశుభ్రంగా ఉండటం వంటి తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తించారు.సంబంధిత హోటళ్లకు నోటీసులు జారీ చేయడంతో పాటు జరిమానాలు విధించారు.ఈ సందర్భంగా బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదుపై వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న జిల్లా ఆహార భద్రతాధికారి హరితకి మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.అయితే ఈరోజుతోనే కాకుండా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు తరచూ నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే హోటళ్లు,రెస్టారెంట్లపై ఎలాంటి రాజీలేకుండా చట్టపరమైన చర్యలు కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :