Sunday, 13 September 2026 06:56:16 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

పోలీసులపై దాడి చేసిన హర్యానా వ్యక్తులు

పోలీసుల అదుపులో హర్యానా వ్యక్తులు

Date : 28 June 2026 08:22 AM Views : 254

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సదుం - జూన్ 28 : అన్నమయ్య జిల్లా సదుం పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తుకు బానిసైన ఇద్దరు హర్యానా వ్యక్తులు ఏకంగా పోలీసుల పైనే దాడికి తెగబడ్డారు విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ, సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

సదుం గాంధీ రోడ్డులోని సాయిబాబా దేవాలయం ఎదురుగా ఉన్న దస్తగిరి ఇంట్లో అద్దెకు ఉన్న హర్యానాకు చెందిన హితేశ్వర్, రామేశ్వర్ అనే ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్ వినియోగిస్తూ, అక్రమంగా రివాల్వర్ కలిగి ఉండి స్థానికులను బెదిరిస్తున్నారనే పక్కా సమాచారంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సదుం ఎస్ఐ విష్ణు నారాయణ, కానిస్టేబుల్ సుబ్రమణ్యం, హోంగార్డు చాంద్ బాషా తనిఖీ కోసం వారి నివాసానికి వెళ్లగా తనిఖీలు నిర్వహించే క్రమంలో అనుమానాస్పద స్థితిలో ఉన్న హుక్కా మిషన్‌ను గమనించిన ఎస్ఐ ప్రశ్నించేలోపే, తీవ్ర మత్తులో ఉన్న ఆ వ్యక్తులు ఒక్కసారిగా ఎస్ఐ సహా పోలీసు సిబ్బందిపై దాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని తీవ్రంగా ప్రతిఘటించి అదుపులోకి తీసుకున్నారు. వారి నివాసంలో క్షుణ్ణంగా తనిఖీ చేయగా 10 లీటర్ల నాటుసారా, 18 మద్యం బాటిళ్లు, హుక్కా మిషన్, ఒక బాకు (కత్తి) లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడిలో గాయపడిన ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డులను సదుం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

ఈ దాడి ఘటన గురించి సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తక్షణమే స్పందిస్తూ గాయపడిన పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అసాంఘిక శక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ పోలీసులపైనే దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :