Monday, 14 September 2026 06:31:31 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె ఇంచార్జి గా త్వరలో ఆమోదయోగ్యమైన నాయకుడు - జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ

నెల రోజుల లోపలే ఇంచార్జ్ ను ప్రకటిస్తాం

Date : 01 February 2026 08:54 PM Views : 367

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 01 : తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఇన్చార్జిగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎదుర్కొనే దీటైన నాయకుడిని అధిష్టానం త్వరలో ఎంపిక చేస్తున్నట్లు జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఆదివారం మదనపల్లి జిల్లా కేంద్రం ఏర్పాటు జరిగిన మొదటిసారి మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాకను తంబళ్లపల్లి నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల నాయకులు, కార్యకర్తలు తంబళ్లపల్లె నియోజకవర్గం నడిపించే నాయకుడు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తమకు అండగా నిలవాలని మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటని గత ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కష్టపడినా ఫలితం లేక పోవడం విచారకరమని భవిష్యత్తులో తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు, కార్యకర్తకు అండగా నిలబడి ఆదుకుంటామని ఇందులో భాగంగా పార్టీ అధిష్టానం తంబళ్లపల్లె నియోజకవర్గానికి దీటైన నాయకుడిని ఎంపిక చేస్తున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. తెలుగుదేశం శ్రేణులు నిరుత్సాహపడకుండా ఐకమత్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె నుండి భారీగా వాహనాల్లో తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఆప్యాయంగా పలకరించి మీకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ మంత్రి భరోసా ఇవ్వడంతో కార్యకర్తలు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: