Sunday, 13 September 2026 07:40:34 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

అకడమిక్ నుండీ పరిశ్రమ వరకూ అనే అంశం అతిధి ఉపన్యాసం

Date : 16 February 2026 10:32 PM Views : 338

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 16 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెల్ విభాగం వారు మిట్స్ ఐ.ఈ.టీ.ఈ స్టూడెంట్ చాప్టర్ వారి సహకారంతో వీ.ఎల్‌.ఎస్‌.ఐ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ అకాడెమిక్ నుండి పరిశ్రమ వరకు ప్రయాణం” అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బెంగళూరు కు చెందిన క్వాల్‌కామ్ కంపెనీ సీనియర్ లీడ్ ఇంజనీర్, అభిషేక్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది అని, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు చిప్ డిజైన్ కేంద్రాలను స్థాపించడం ద్వారా వీ.ఎల్‌.ఎస్‌.ఐ చిప్ డిజైన్ రంగంలో శిక్షణ పొందిన ఈసీఈ విద్యార్థులకు అధిక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. అకాడెమిక్ స్థాయిలో అభ్యసించే సి.మాస్ సెమీకండక్టర్ సాంకేతికత, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీ ప్రక్రియ, మ్యాక్స్‌వెల్ సమీకరణాలు, ప్రసార రేఖలు మరియు తరంగ ప్రసరణ వంటి ప్రాథమిక అంశాలు పరిశ్రమలో ఎంత ముఖ్యమో వివరించారు. విద్యుత్ క్షేత్రం మరియు అయస్కాంత క్షేత్రం ప్రయాణించే తరంగాలు ద్వారా యాంటెన్నా రూపకల్పన వంటి ప్రాజెక్టులపై ప్రయోగాత్మక అనుభవం పెంపొందించుకోవచ్చని తెలిపారు. రేడియో ఫ్రీక్వెన్సీ మరియు మైక్రోవేవ్ రూపకల్పన, చిప్ ధృవీకరణ వంటి ఆధునిక రంగాల్లో నైపుణ్యాభివృద్ధి ద్వారా మెరుగైన కెరీర్ అవకాశాలు సాధ్యమవుతాయని అన్నారు. చిప్ డిజైన్ నైపుణ్యం కలిగిన ఇంజినీర్లకు పరిశ్రమల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉండటంతో పాటు, భవిష్యత్తు సాంకేతిక అభివృద్ధిలో ఇవి మరింత కీలకంగా మారనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్.రాజశేఖరన్, కోఆర్డినేటర్ వి.ఎస్ ప్రశాంత్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :