Sunday, 13 September 2026 09:57:22 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

విద్యార్థులకు ఇచ్చిన హామీలకే పరిమితమా,అమలు చేసేది ఏమైనా ఉందా నారా లోకేష్...?

ప్రభుత్వ వసతి గృహల్లో మౌలిక వసతుల కల్పన లో నిర్లక్ష్యం, పెండింగ్లో ఉన్న 6400 కోట్లు ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి

Date : 06 November 2025 04:05 PM Views : 219

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 06 : ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరుగుతున్న బస్సు యాత్ర 16వ రోజు చేరుకున్న సందర్భంగా మదనపల్లి పట్టణంలో ఉన్న GRT పాఠశాల ప్రాంగణంలో అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ బహిరంగ సభలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వలరాజు, నాసర్ జి, రాష్ట్ర సహాయ కార్యదర్శి,మస్తాన్ నాగభూషణం, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ భవిత, చిత్తూరు జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఆంధ్ర యూనివర్సిటీ కార్యదర్శి అభి మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు కృష్ణప్ప, మురళి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థులకు అనేక హామీ ఇచ్చి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద విద్యార్థుల కష్టాలు తీరుస్తామని చెప్పిన ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎన్నికలలో విద్యార్థులకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని కూటమి ప్రభుత్వం పైన మండిపడ్డారు. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెల రోజుల్లో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 6400 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ ఆ హామీ దాదాపు ఒకటిన్నర సంవత్సరం ప్రభుత్వ పరిపాలన పూర్తవుతా ఉన్నా నేటికీ కేవలం హామీగానే మిగిలిపోయింది తప్ప అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో తుతు మంత్రంగా విడుదల చేసి అవి పేపర్ ప్రకటనలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేసిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 100% మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైనటువంటి వసతులు లేక సరైనటువంటి ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. హాస్టల్స్ లో విద్యార్థులకు సరిపడ గదులుగాని బాత్రూములు గాని లేవన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మేస్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యను దూరం చేసే విధంగా వైసిపి ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకుని వస్తే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే వందరోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ గారు నేడు ఒకటిన్నర సంవత్సరం పూర్తవుతా ఉన్న జీవో నెంబర్ 77 రద్దు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న టీచర్ లెక్చరర్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.. రాష్ట్రంలో విద్యార్థులకు హాస్టల్లో మౌలిక వసతులు లేక మరణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేయడంలో ఏమాత్రం కూడా పట్టించుకోలేదని హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన పదవికి న్యాయం చేయకుండా రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రి అన్నట్టు విదేశాలు తిరుగుతూ విద్యారంగాన్ని పూర్తిగా నీరుగారిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోయిన చరిత్ర రాష్ట్రంలో ఉందని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలు పరిష్కరించకపోతే కూటమి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు విద్యార్థులు అగ్ర భాగాన నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతపురంలో ఈనెల 12వ తేదీ ముగింపు సభ నిర్వహిస్తామని ఈ సభ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రెడ్డి, ఏఐఎస్ఎఫ్ మదనపల్లి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కమలాకర్, వినయ్, సాయి కార్యదర్శి సాయి కిరణ్, ములకలచెరువు మండల కార్యదర్శి తరుణ్ , విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :