నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 26 : తంబళ్లపల్లె జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థుల్లో సామాజిక సేవాభావం పెంపొందించుకోవాలని ఎంఈఓ త్యాగరాజు సూచించారు. బుధవారం కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ల ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో గ్రామాలలో పారిశుద్ధ్యపు పనులు చేపట్టడం, మొక్కలు నాటి సంరక్షణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News