Sunday, 13 September 2026 07:11:38 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ విద్యార్థులకు స్టార్ట్‌అప్స్ కోసం సమర్థవంతమైన సేల్స్ & మార్కెటింగ్ వ్యూహాలపై అవగాహన

Date : 31 January 2026 08:23 PM Views : 144

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 31 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) విభాగం వారు మిట్స్ ఐ ఐ సి ఆధ్వర్యంలో స్టార్ట్‌అప్స్ కోసం సమర్థవంతమైన సేల్స్ & మార్కెటింగ్ వ్యూహాలు అనే అంశంపై విద్యార్థులకు అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తిరుపతి కి చెందిన కొటాక్ లైఫ్ ఇన్సూరెన్స్ కో ఆపరేటివ్ లిమిటెడ్ డిప్యూటీ చీఫ్ మేనేజర్–ట్రైనింగ్, పి.రామకృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్టార్ట్‌అప్స్ ప్రారంభ దశలో ఎదురయ్యే సవాళ్లు, మార్కెట్ అవసరాలను గుర్తించడం, వినియోగదారులను ఆకర్షించే విధానాలు వంటి అంశాలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వ్యాపార దృష్టికోణం కూడా కలిగి ఉండాలని, పరిశ్రమ ఆధారిత విద్య మరియు ప్రాక్టికల్ అనుభవం స్టార్టప్ విజయానికి కీలకమని అన్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో డిజిటల్ మార్కెటింగ్, బ్రాండింగ్ మరియు కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయని అన్నారు. సరైన సేల్స్ మరియు మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేయడం ద్వారా నూతన ఆవిష్కరణలు వేగంగా అభివృద్ధి చెందగలవని తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్రచారం ద్వారా వ్యాపారాన్ని విస్తరించవచ్చని సూచించారు. విద్యార్థులు సరైన కమ్యూనికేషన్ స్కిల్స్, మార్కెట్ అవగాహన, సేకరించిన సమాచారాన్ని పరిశీలించి, అర్థం చేసుకుని సరైన ఆలోచనలతో పాటు ప్రాక్టికల్ అనుభవం ఉంటే స్టార్ట్‌అప్స్‌లో వేగంగా అభివృద్ధి చెందదడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఆర్.కల్పనా, కోఆర్డినేటర్ టి.పవన్, కో కోఆర్డినేటర్ డాక్టర్ చొక్కనాథన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :