నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వెలుగు సంస్థలో వైభవంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం - హాజరైన సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి,కన్వీనర్ భాగ్యలక్ష్మీ మదనపల్లె : పట్టణంలోని అమ్మచెరువుమిట్ట నందు గల వెలుగు సంస్థ ఆవరణంలో సోమవారం దివ్యాంగులు,వృద్ధుల సంక్షేమం,ఆరోగ్యం,సంతోషం శ్రేయస్సు కోసం శ్రీసత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.వెలుగు సంస్థ కార్యదర్శి ఎం.ఉదయ్ మోహన్ రెడ్డి,ఆర్.భాగ్యలక్ష్మీ దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తిపూర్వకంగా నిర్వహించి,స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా సంస్థలోని దివ్యాంగ పిల్లలు,వృద్ధ మహిళలు,సిబ్బంది ఇతరులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.అలాగే సంస్థ నిరంతరం అభివృద్ధి చెందు తూ మరింత మంది దివ్యాంగులు,వృద్ధులకు సేవలు అందించే అవకాశం కలగాలని కోరుకున్నారు.అనంతరం అందరికి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వెలుగు కన్వీనర్ ఆర్.భాగ్యలక్ష్మి ,వెలుగు ట్రెజరర్ ఎన్.రఘునాథ రెడ్డి సతీమణి రమాదేవి,సూపరింటెం డెంట్ యం.ఉదయ్ కుమార్ రెడ్డి,ఈసి మెంబర్ యం.సుజాత,ధాత్రి ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ స్వాతి చక్రపాణి,వెలుగు ప్రిన్సిపాల్ పి.లీనాకుమారి,సోషల్ వర్కర్ యం.గీత,వార్డెన్ యం.స్వీటీ,వెలుగు సిబ్బంది,స్నేహితులు,దివ్యాంగులు,వృద్దులు పాల్గొన్నారు.
Reporter
Namitha News