Sunday, 13 September 2026 03:54:28 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

నేటి తరం స్ఫూర్తిప్రదాత దామోదరం సంజీవయ్య

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలు

Date : 14 February 2026 12:16 PM Views : 258

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - ఫిబ్రవరి 14 : తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు, నిరాడంబరతకు మారుపేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవయ్య గారి 105వ జయంతి వేడుకలు శనివారం రాయచోటిలోని పోలీస్ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (అడ్మిన్) శ్రీ వి.జె. రామకృష్ణ గారు సంజీవయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (అడ్మిన్) రామకృష్ణ గారు మాట్లాడుతూ.. సమాజం కోసం అంకితభావంతో పనిచేసిన ఇలాంటి మహనీయుల జయంతి వేడుకలను జరుపుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. కేవలం 38 ఏళ్లకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఘనత సంజీవయ్య గారిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా సేవలు అందించి, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారు. 1938లో ఎస్.ఎస్.ఎల్.సి లో కర్నూలు జిల్లాలోనే ప్రథముడిగా నిలిచిన ఆయన, నేటి విద్యార్థులకు, యువతకు గొప్ప రోల్ మోడల్. సంయుక్త మద్రాసు రాష్ట్రంలోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారని ఆర్.ఐ. కొనియాడారు. ఈ వేడుకల్లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె.సురేష్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ఐలు ఎ. శ్రీనివాస్, జి. రవి. పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొని సంజీవయ్య గారికి అంజలి ఘటించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని ప్రతినబూనారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: