Saturday, 12 September 2026 01:53:08 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

మిట్స్ లో ప్రాజెక్ట్ ఎక్స్‌పో–2026

Date : 06 August 2026 07:34 PM Views : 128

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 06 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఎక్స్‌పో–2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నైకి చెందిన కెరీర్ స్కూల్ & హెచ్.ఆర్ సొల్యూషన్స్ సంస్థ హెచ్.ఆర్ లీడ్ మాస వెంకట సాయి కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్ట్ ఎక్స్‌పోలు విద్యార్థులను పరిశోధన, స్టార్టప్‌లు, పేటెంట్లు మరియు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన సాంకేతిక పరిష్కారాల అభివృద్ధి వైపు ప్రోత్సహిస్తాయని అన్నారు. విద్యా సంస్థల్లో ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందిస్తూ, విద్యార్థులను భవిష్యత్తు సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనే సమర్థ ఇంజనీర్లుగా తీర్చిదిద్దడంలో ప్రాజెక్ట్ ఎక్స్‌పోలు ఎంతో కీలకమని అన్నారు. నేటి సాంకేతిక ప్రపంచంలో విద్యార్థులు పుస్తక పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ అనుభవం చాలా ముఖ్యమని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎక్స్‌పోలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన రెండవ, మూడవ మరియు తుది సంవత్సరం విద్యార్థులు మొత్తం 61 బృందాలుగా పాల్గొని, వివిధ అత్యాధునిక సాంకేతిక రంగాలకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన వినూత్న ఆవిష్కరణలు, సమాజంలో ఎదురయ్యే సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను ప్రతిబింభించాయని తెలిపారు. కార్యక్రమంలో ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్ధి బృందాలకు వరుసగా రూ.2,500, రూ.1,500 మరియు రూ.1,000 నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్-స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ సి. చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీదేవి, కోఆర్డినేటర్స్ డాక్టర్ ఆర్. సుధాకర్, డాక్టర్ జి. అరుణ్ కుమార్, డాక్టర్ డి.జె. అష్పిన్ పాబి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: